Homeజాతీయ వార్తలుKCR -Rahul Gandhi : నాటి బఫూన్‌.. నేడు బాహుబలి ఎలా అయ్యాడు చంద్రశేఖరా..?

KCR -Rahul Gandhi : నాటి బఫూన్‌.. నేడు బాహుబలి ఎలా అయ్యాడు చంద్రశేఖరా..?

KCR -Rahul Gandhi : లంకలో పుట్టినవారంతా రాక్షసులే అనేది పరాతన గాధ.. ఆంధ్రాలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులే.. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట. కానీ ఈ రెండింటినీ నేటి సమాజం అంగీకరించడం లేదు. రావణాసురుని పాలన రాముని కంటే గొప్పగా ఉండేదని లంకేయులు(శ్రీలంక, తమిళనాడులో ఉన్నవారు) చెబుతున్నారు. ఇక ఆంధ్రాల్లో ఉన్నవారంతా తెలంగాణ ద్రోహులే అన్న కేసీఆర్‌ మాటలను ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు వ్యాఖ్యలపై తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతంలో, ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు రాహుల్‌గాంధీని బఫూన్‌గా అభివర్ణించిన కేసీఆర్‌ ఇప్పుడు బాహుబలిగా చూపే ప్రయత్నం చేయడం గమనార్హం. గతంలో కేసీఆర్‌ ఆంధ్రులపై వ్యాఖ్యలు చేసినట్లే.. నాలుగేళ్ల క్రితం రాహుల్‌ గాంధీ కూడా మోదీ గురించి మాట్లాడారు. కర్నాటక ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ మోదీ పేరు ఉన్నవారంతా దొంగలే అని ప్రకటించారు. అయితే నాడు కేసీఆర్‌పై ఆంధ్రులెవరూ కేసు పెట్టలేదు కాబట్టి కేసీఆర్‌కు పదవీ గండం తప్పింది.. రాహుల్‌పై గుజరాత్‌ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు పెట్టడంతో రెండేళ్ల జైలు శిక్ష పడడంతోపాటు పదవీ కోల్పోవాల్సి వచ్చింది.

-నాటి కేసీఆర్‌ మాటలు నేడు వైరల్‌..
కాంగ్రెస్‌ అగ్రనేత, గాంధీ కుటుంబ వారసుడు అయిన రాహుల్‌ గాంధీ గురించి కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ కేసీఆర్‌ ఏమన్నాడంటే.. రాహుల్‌ను ‘‘బిగ్గెస్ట్‌ బఫూర్‌ ఆఫ్‌ది కంట్రీ’’గా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ఈ విషయం దేశమంతా తెలుసని జనరలైజ్‌ చేశారు. అదే నిజమని నమ్మేలా వ్యాఖ్యానించారు. నాడు ఎందుకలా మట్లాడాటంటే.. నాటు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీతో, ప్రధాని మోదీతో సఖ్యత ఉండేది. దీంతో నాడు రాహుల్‌ కేసీఆర్‌కు బఫూన్‌లా కనిపించాడు. తన అభిప్రాయాన్నే దేశ ప్రజల అభిప్రాయంగా చెప్పారు గులాబీ బాస్‌..

-అనర్హతపై నేడు అగ్రహం..
తాజాగా అదే కేసీఆర్‌ రాహుల్‌ గాంధీని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ‘మోదీ’పై చేసిన వ్యాఖ్యలతో రెండేళ్ల జైలు శిక్ష పడడం, ఆ వెంటనే ఎంపీ పదవి కోలోపవడంతో కేసీఆర్‌ రాహుల్‌(బిగ్గెస్ట్‌ బఫూన్‌ ఆఫ్‌ ది కంట్రీ)కు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. యూపీఏ 2 సమయంలో చేసిన చట్టం ప్రకారమే రెండేళ్ల శిక్ష పడిన రాహుల్‌ పదవి కోల్పోయాడు. దానిపై ఆర్డినెన్స్‌ తెస్తే నాడు రాహుల్‌గాంధే తప్పు పట్టారు. ఇప్పుడు అదే చట్టం ప్రకారం రాహుల్‌పై పార్లమెంట్‌ సెక్రెటరీ చర్య తీసుకుంటే.. అటు కాంగ్రెస్‌తోపాటు, ఇటు విపక్ష నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజ్యాంగం ప్రకారం తీసుకున్న చర్యనే వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయితే.. రాహుల్‌పై చర్య ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారం, నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొనితె చ్చుకుంటున్నారు’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

నాడు రాహుల్‌ను బిగ్గెస్ట్‌ బఫూన్‌ ఆఫ్‌ది కంట్రీగా, ఆంధ్రులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పుడు జాతీయ పార్టీ కోసం ఆంధ్రులతో సక్యత కోసం.. కేంద్రంలో మోదీని ఓడించడానికి రాహుల్‌గాంధీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే రాహుల్‌ను నాడు బఫూర్‌ అన్న కేసీఆరే.. నేడు బాహుబలిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version