https://oktelugu.com/

KCR: కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు కేసీఆర్ పైఎత్తులు.. డైలామాలో జాతీయ పార్టీలు

KCR: గులాబీ బాస్ గేర్ మార్చారు. ప్రతిపక్షాలు వేస్తున్న నాటకాలను మొన్నటి వరకు చూసీచూడనట్టుగా వ్యవహరించిన కేసీఆర్ ఒక్కసారిగా జూలు విధిలించారు. ఉద్యమ కాలంలో అనుసరించిన వ్యూహాలకు మళ్లీ పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అనే శాస్త్రాన్ని కేసీఆర్ బాగా వంటబట్టించుకున్నారు. సాధారణంగానే ఇలాంటి శాస్త్రాలు చెప్పి జనాలను తనవైపుకు తిప్పుకోవడంలో కేసీఆర్ తలపండిన మేధావి. ఇక ఎవరినైనా టార్గెట్ చేశారంటే వారిని భూ స్థాపితం చేసే వరకు నిద్రపోరు. 2014 ఎన్నికల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 2, 2021 / 11:50 AM IST
    Follow us on

    KCR: గులాబీ బాస్ గేర్ మార్చారు. ప్రతిపక్షాలు వేస్తున్న నాటకాలను మొన్నటి వరకు చూసీచూడనట్టుగా వ్యవహరించిన కేసీఆర్ ఒక్కసారిగా జూలు విధిలించారు. ఉద్యమ కాలంలో అనుసరించిన వ్యూహాలకు మళ్లీ పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అనే శాస్త్రాన్ని కేసీఆర్ బాగా వంటబట్టించుకున్నారు. సాధారణంగానే ఇలాంటి శాస్త్రాలు చెప్పి జనాలను తనవైపుకు తిప్పుకోవడంలో కేసీఆర్ తలపండిన మేధావి. ఇక ఎవరినైనా టార్గెట్ చేశారంటే వారిని భూ స్థాపితం చేసే వరకు నిద్రపోరు. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టినట్టే ఇప్పుడు బీజేపీకి కూడా అదే శాస్తి చేయాలని అనకుంటున్నారట..

    KCR

    ఎక్కడా తగ్గొద్దని ఆదేశాలు..

    గతంలో టీఆర్ఎస్ నేతలు కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే కామెంట్స్‌కు మాత్రమే కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఫోకస్ బీజేపీకి మారింది. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటాన్ని గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే.. కానీ 2018 ముందస్తు ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పీసీసీ పదవి వేటలో పడి నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేశారు. దీంతో బీజేపీ క్రమంగా బలపడుతూ వచ్చింది. దానికి కారణం కూడా టీఆర్ఎస్ పార్టీనే.. కాంగ్రెస్‌ను తొక్కిపెట్టాలని బీజేపీని కొంచెం హైలైట్ చేసింది. కాంగ్రెస్ చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వకుండా బీజేపీ నేతలకు సమాధానం ఇవ్వడంతో ప్రజలు కూడా బీజేపీనే ప్రత్యామ్నాయం అనుకునే పరిస్థితి వచ్చింది. అయితే, ప్రస్తుతం టీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం.

    హుజురాబాద్, దుబ్బాక ఎఫెక్ట్..

    హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చాయి.దీంతో బీజేపీ బలపడుతుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వనుందని బీజేపీ లీడర్లు పదేపదే చెబుతుండటంతో గులాబీ వర్గాల్లో అలజడి మొదలైంది. దీనికి తోడు రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్‌కు తెలిపాయట.. దీంతో గులాబీ బాస్ రంగంలోకి దిగారు. 2023 ఏడాది చివరలో ఎన్నికలు ఉండటంతో ఇప్పటినుంచే కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒకే సారి చెక్ పెట్టి ప్రజల్లో మళ్లీ ఆదరణ పొందేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని టాక్..

    Also Read: AP Politics: ఏపీలో కమ్మ సామాజిక వర్గం ఒకటవుతుందా?

    ఒకే ఒక్క మీటింగ్‌తో..

    టీఆర్ఎస్, బీజేపీ తోక పార్టీలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు పదేపదే ప్రచారం చేస్తున్నాయి. మొన్నటివరకు కేంద్రంతో జతకట్టిన కేసీఆర్ రాష్ట్రంలో కాషాయం బలపడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో వరి ధాన్యం కొనుగోలు పేరుతో అటు బీజేపీని ప్రజల్లో విలన్‌ను చేశారు. పార్లమెంటులో తమ ఎంపీలతో ఆందోళన చేయించి రైతుల పక్షాన తాము ఉన్నామని గట్టి సంకేతాన్ని ఇచ్చారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే వస్తున్న కామెంట్స్‌కు చెక్ పెట్టేలా.. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన విపక్ష పార్టీల మీటింగ్ కు టీఆర్ఎస్ తరఫున కే.కేశవరావు హాజరయ్యారు. టీఆర్ఎస్ వేసిన ఈ ఒక్క స్టె‌ప్‌తో రాష్ట్ర కాంగ్రెస్ డైలామాలో పడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ దోస్తీపై ఏం సమాధానం చెబుతారని ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇలా కేసీఆర్ తన చాణక్య నీతితో ఇరు పార్టీలను సందిగ్దంలో పడవేశారు.

    Also Read: Srisailam: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసా?

    Tags