https://oktelugu.com/

Bangarraju Song: ‘బంగార్రాజు’ సినిమా నుంచి త్వరలో మంచి మెలోడీ సాంగ్​.. ఆకట్టుకుంటున్న టీజర్​

Bangarraju Song: అక్కనేని నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా నచిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్​ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా బేబమ్మ కృతిశెట్టి కనిపించనుంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంక బంగార్రాజు సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 11:31 AM IST
    Follow us on

    Bangarraju Song: అక్కనేని నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా నచిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్​ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా బేబమ్మ కృతిశెట్టి కనిపించనుంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంక బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతిశెట్టి, ఇటీవలే ఈ పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ అందమైన పాటలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన టీజర్​ విడుదల చేసింది చిత్రబృందం.

    ఈ పాట నాగచైతన్య- కృతిశెట్టి మధ్య వచ్చే పాట. మెలొడీగా రూపొందినట్లు ఈ సాంగ్​ టీజర్​ను బట్టి అర్ధమైంది. నాకోసం నువ్వు.. అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా.. సిద్​ శ్రీరామ్​ ఆలపించారు. అనూప్​ రూబెన్స్ స్వరాలు అందించారు. పూర్తి పాటను డిసెంబరు 5న సాయంత్రం 5.12 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు జీ స్టూడియోస్​, అన్నపూర్ణ స్టూడియోస్​ సంయుక్తంగా నిర్మాణం వహించారు. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రూపొందించిన ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో చలపతిరావు, రావురమేశ్​, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్​, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    Also Read: ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ ​సింగరాయ్’​ ప్రోమో.. నాని ఎలివేషన్​ అదుర్స్​

    Naga chaitanya as Bangarraju

    కాగా, లవ్​స్టోరీ సినిమా తర్వాత వరుస సినిమాలో దూసుకెళ్లిపోతున్నారు నాగచైతన్య. థ్యాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్​లో అమీర్​ఖాన్​ నటిస్తున్న లాల్​సింగ్ చద్దాలోనూ నటిస్తున్నారు.

    Also Read: ఆచార్యలో చరణ్​ పాత్ర నిడివిపై మరింత క్లారిటీ