https://oktelugu.com/

Unstoppable Episode 3: అమ్మో.. బ్రహ్మి-బాలయ్య కామెడీ మాములుగా లేదుగా.. ట్రెండింగ్​లో అన్​స్టాపబుల్​ కొత్త ప్రోమో

Unstoppable Episode 3: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానుల ఆనందాలకు హద్దే ఉండదు. అలాంటి బాలయ్య ఆహా ఓటీటీ వేదికగా అన్​స్టాపబుల్​ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తూ.. తనలోని మరో ప్రతిభను బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే షోకు సంబంధించిన రెండు ఎపిసోడ్​లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. తొలి ఎపిసోడ్​లో మంచు మోహన్​బాబు గెస్ట్​గా రాగా.. రెండో ఎపిసోడ్​లో నేచురల్​ స్టార్​ నాని వచ్చి అలరించారు. ఇదిలా ఉంటే గాయం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 11:59 AM IST
    Follow us on

    Unstoppable Episode 3: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానుల ఆనందాలకు హద్దే ఉండదు. అలాంటి బాలయ్య ఆహా ఓటీటీ వేదికగా అన్​స్టాపబుల్​ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తూ.. తనలోని మరో ప్రతిభను బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే షోకు సంబంధించిన రెండు ఎపిసోడ్​లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. తొలి ఎపిసోడ్​లో మంచు మోహన్​బాబు గెస్ట్​గా రాగా.. రెండో ఎపిసోడ్​లో నేచురల్​ స్టార్​ నాని వచ్చి అలరించారు.

    ఇదిలా ఉంటే గాయం కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు మూడో ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ షోకి హాజరయ్యారు. డిసెంబరు 3 రార్తి 8 గంటలకు ఆహా వేదికగా టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్​గా మారింది. ఎపిసోడ్​ మొత్తం ఫుల్​ ఫన్​ క్రయేట్​ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య, బహ్మానందం మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయించినట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఈ షోలో బ్రహ్మానందంతో పాటు దర్శకుడు అనిల్​ రావిపూడి కూడా హాజరయ్యారు.

    Unstoppable Episode 3 with brahmanandam

    Also Read: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ

    ఇక చివర్లో అనిల్​ రావిపూడితో మాట్లాడుతూ.. బ్రహ్మానందం మన సినిమాలో కూడా.. అని ఆపేశారు. దీంతో అనిల్​ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారని హింట్​ ఇచ్చేశారు. ప్రోమో లోనే ఈ రేంజ్​ కామెడీ ఉంటే.. పూర్తి ఎపిసోడ్​లో ఇంకెంత ఫన్​ క్రియేట్​ అయ్యిందో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

    కాగా, బాలయ్య నటించిన అఖండ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్​ అయ్యింది. ఇప్పటికే మంచి రెస్పాన్స్​ అందుకుని దూసుకెళ్లిపోతోంది.

    Also Read: బాలయ్య అఖండ హిట్​ టాక్​ అందుకోవాలంటే రాబట్టాల్సిన కలెక్షన్​ ఎంతో తెలుసా?