KCR- BJP: తాను ఎంత నెత్తిన పెట్టుకుంటున్నప్పటికీ.. సొంత కులపోళ్ళు కెసిఆర్ కు నమ్మకద్రోహం చేస్తూనే ఉన్నారు. తనకు ఏమాత్రం గిట్టని భారతీయ జనతా పార్టీకి కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడి చర్చకు దారితీస్తోంది. కే సీ ఆర్ పై బిజెపి ఎటాక్ షురూ చేసిందని, ఇది శాంపిల్ మాత్రమేననే చర్చ కూడా నడుస్తోంది.. వాస్తవానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలమలకు కేసీఆర్ ఇతోధికంగా సహాయం చేశారు. అంతేకాదు ప్రభుత్వం తరఫునుంచి భారీగా మేళ్లను అందేలా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మా, స్థిరాస్తి, ఇతర వ్యాపారాల్లో వెలమలు ఇప్పుడు ముందంజలో ఉన్నారు.. పైగా ప్రభుత్వ రంగానికి సంబంధించి పలు కీలక పోస్టుల్లో కూడా కేసీఆర్ వెలమలకే ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ వారు భారతీయ జనతా పార్టీకి జై కొడుతుండడం కెసిఆర్ తట్టుకోలేకపోతున్నారు.

యశోద 10 కోట్లు
గోరుకంటి సురేందర్రావు నేతృత్వంలో నెలకొల్పిన యశోద ఆసుపత్రి ఇప్పుడు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థగా ఎదిగింది.. ముఖ్యమంత్రి అయిన తర్వాత యశోద ఆసుపత్రికి, కెసిఆర్ కు మధ్య అనుబంధం బాగా పెరిగింది. తనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్తారు.. అక్కడ పనిచేసే జి ఎస్ రావు కేసీఆర్ కు ఫ్యామిలీ డాక్టర్. పైగా గోరుకంటి సురేందర్రావు, ఆయన సోదరులు చంద్రశేఖర రావు కు సన్నిహితులుగా మారిపోయారు. సొంత సామాజిక వర్గం కావడంతో కెసిఆర్ కూడా బాగానే చేరదీశారు.. హైటెక్ సిటీలో అత్యంత భారీ ఆసుపత్రి యశోద గ్రూప్ నెలకొల్పిందంటే దానికి కారణం కేసీఆరే. ప్రభుత్వపరంగా, కెసిఆర్ పరంగా ఎన్నో మేళ్లను పొందిన యశోద గ్రూప్… ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడుతున్నది. ఆ మధ్య ఆ ఆసుపత్రి పై ఐటీ రైడ్స్ జరిగాయి.. తర్వాత ఏమైందో తెలియదు గానీ… ఐటీ దాడులు ఆగిపోయాయి.. సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి యశోద ఆసుపత్రి ఏకంగా 10 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తనకు వచ్చిన ఎలక్టో రల్ ఫండ్స్ వివరాలలో వెల్లడించింది. మరోవైపు బిజెపి నేత విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ మూడు కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ జాబితాలో యశోద గ్రూప్ మాత్రమే అగ్రస్థానంలో ఉంది.
మై హోమ్ దూరం దూరం
ముందుగానే చెప్పినట్టు కెసిఆర్ కు సన్నిహితంగా ఉన్న మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు… ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.. ఆ మధ్య సమతా మూర్తి విగ్రహావిష్కరణలో ఏర్పడిన చిన్న ఇష్యూ కారణంగా కెసిఆర్ తన క్యాంప్ నుంచి జూపల్లి రామేశ్వరరావు బయటకు నెట్టేశాడు.. ఇదే అదునుగా బిజెపి అతడిని క్యాచ్ చేసింది. ఇంకా అదే దశలో క్రెడాయ్ లో కీలకంగా ఉన్న వెలమ సామాజిక వర్గం వారిని బిజెపి పట్టేసుకుందని సమాచారం.

ఆర్థిక మూలాలపై దెబ్బ
భారతీయ జనతా పార్టీ కెసిఆర్ సొంత సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయడం.. గతంలో ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సహాయం చేశారనే అపవాదు ఉంది. పైగా గత కొంతకాలం నుంచి భారతీయ జనతా పార్టీపై కేసీఆర్ నేరుగానే ఫైట్ చేస్తున్నారు.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పెద్దలు కేసిఆర్ కు పొగ పెట్టడం ప్రారంభించారు.. అందులో భాగంగానే ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు.. అంతేకాదు సొంత సామాజిక వర్గం వారిని దూరం చేయడం ద్వారా ఎన్నికల నాటికి కెసిఆర్ ను ఒంటరి చేయాలనేది వారి టార్గెట్.