Kiara Advani Marriage: స్టార్ లేడీ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి వార్తలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. 2022 డిసెంబర్ లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమన్నారు. తాజా సమాచారం ప్రకారం కియారా-సిద్ధార్థ్ పెళ్లి తేదీ ఫిబ్రవరికి మారిందట. కియారా వివాహంపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఫిబ్రవరి 6న కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టనున్నాడు. రాజస్థాన్ లో గల జైసల్మేర్ ప్యాలెస్ ఈ వివాహానికి వేదిక కానుంది. 4,5 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. 3వ తేదీన సెక్యూరిటీ సిబ్బంది జైసల్మేర్ ప్యాలెస్ కి వెళ్లి కావలసిన ఏర్పాట్లు చేయనున్నారట.

కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ కి బాలీవుడ్ ప్రముఖులు పలువురు హాజరు కానున్నారు. టాలీవుడ్ నుండి హీరో రామ్ చరణ్ హాజరయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం కియారా ఆయనకు జంటగా ఆర్సీ 15 మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కియారా వివాహానికి హాజరు కావచ్చు. కియారా-సిద్ధార్థ్ కలిసి షేర్షా మూవీలో నటించారు. ఆ సమయంలోనే కియారా-సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారు. రిలేషన్ కొనసాగుతున్నప్పటికీ తాము ప్రేమలో ఉన్నట్లు ఎన్నడూ వెల్లడించలేదు.
ఏడాది కాలంగా పెళ్లి పుకార్లు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కియారా హీరోయిన్ గా మంచి ఫార్మ్ లో ఉన్నారు. 2014లో విడుదలైన ఫగ్లి మూవీతో కియారా వెండితెరకు పరిచయమయ్యారు. ఎం ఎస్ ధోని మూవీ ఆమెకు ఫేమ్ తెచ్చింది. తెలుగులో భరత్ అనే నేను మూవీతో అడుగుపెట్టారు. మహేష్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆ పొలిటికల్ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది.

అనంతరం రామ్ చరణ్ కి జంటగా వినయ విధేయ రామ చిత్రం చేశారు. ఈ మూవీ పూర్తి స్థాయిలో ఆడలేదు. బాలీవుడ్ బిజీ అయిన కియారా తెలుగులో చిత్రాలు చేయలేదు. మరోసారి రామ్ చరణ్ తో నటించేందుకు సిద్దమైన కియారా ఆర్సీ 15 కి సైన్ చేశారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దిల్ రాజు నిర్మాత కాగా… శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక సిద్దార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్ను చిత్రం జనవరిలో విడుదల అవుతుంది. మిషన్ మజ్ను మూవీలో రష్మిక మందాన హీరోయిన్. నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారు.