https://oktelugu.com/

Kcr:జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్..? క్లారిటీ వచ్చినట్లేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల మాటెత్తారు. దేశానికి కొత్త రాజకీయాలు అవసరమని అందుకు తన తోడ్పాటు కచ్చితంగా ఉంటుందని తెలియజెప్పారు.దీంతో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర కూటమిని తయారు చేయనున్నారా..? అనే చర్చలు సాగుతున్నాయి. అయితే గతంలో మూడో ఫ్రండ్ విషయంలో కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. కానీ అది సాధ్యం కాలేదు. తాజాగా ఆయన మరోసారి జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించారు. అయితే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2022 / 12:55 PM IST

    KCR

    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల మాటెత్తారు. దేశానికి కొత్త రాజకీయాలు అవసరమని అందుకు తన తోడ్పాటు కచ్చితంగా ఉంటుందని తెలియజెప్పారు.దీంతో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర కూటమిని తయారు చేయనున్నారా..? అనే చర్చలు సాగుతున్నాయి. అయితే గతంలో మూడో ఫ్రండ్ విషయంలో కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. కానీ అది సాధ్యం కాలేదు. తాజాగా ఆయన మరోసారి జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించారు. అయితే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కొత్త రాజకీయం, రాజ్యాంగా తప్పనిసరి అని తన మాటల ద్వారా తెలియజెప్పారు.

    ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఛిన్నభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రంలో మరో కొత్త రాజ్యం రావాలని పరోక్షంగా చెప్పారు. జాతీయ రాజకీయాలపై త్వరలో మా కార్యాచరణ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ్ కాంగ్రెసేతర ప్రంట్ ఏర్పడితే ప్రధాని పదవి ఎవరికైనా పర్వాలేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలను జాగృతం చేసేందుకు ముందుకు పోవాలని, దానిపై త్వరలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ వంటి నాయకులే గద్దె దిగారు.. మోదీని దించడం పెద్ద లెక్కే కాదని అన్నారు.

    కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లడినప్పడు ముఖ్యంత్రి కేటీఆర్ అని కొందరు మంత్రులు కామెంట్లు చేశారు. కానీ ఆ తరువాత మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సీఎం సూచించినట్లు తెలిసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడలేదు. తాజాగా బీజేపీపై యుద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇతర రాష్ట్రాల నాయకులను ఫోన్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిశోర్ లాంటి రాజకీయ వ్యూహ కర్తతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చూస్తే కేసీఆర్ ఇక ఢిల్లీకి వెళ్లడం ఖాయమే అన్నట్లు భావిస్తున్నారు. కానీ రేపు ఏం జరుగుతుందో.. ఎవరు చెప్పలేమని కేసీఆర్ ఆనడం ఆసక్తిగా మారుతోంది.

    టీఆర్ఎస్ కుమిత్ర పార్టీగా ఉన్న ఎంఐఎం గురించి కేసీఆర్ మాట్లాడారు. ఆ పార్టీ ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో పాగా వేసిందని చెప్పుకొచ్చారు. ఇక త్వరలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొందరు చెబుతున్నారని, కానీ ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లు కచ్చితంగా సాధిస్తామని చెప్పారు. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కార్యకర్తల్లో జోష్ నింపారు.