KCR- Jagan: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, జగన్ అధికారిక కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమ పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. దీని కోసమే జగన్ విశాఖ, కేసీఆర్ నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో కలవాలని భావిస్తున్నారు ఇన్నాళ్లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న నేతలు ఒక్కసారిగా స్టెప్ తీసుకోవడంతో వారి మదిలో ఏముందో అనే సందేహాలు వస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా కేసీఆర్, జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. టీఆర్ఎస్ నిన్న ప్లీనరీ నిర్వహించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నట్లు సూచనప్రాయంగా అంగీకరించింది. దీంతో జాతీయ రాజకీయాల్లో తన ప్రభంజనం చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Women Commission: బాధితులకేదీ స్వాంతన? విమర్శలపాలవుతున్న ఏపీ మహిళా కమిషన్
ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ తనదైన మార్కు చూపించాలని చూస్తున్నారు. రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే జగన్ ఏపీలో వినూత్నంగా పథకాలు ప్రారంభించి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ కూడా మూడో సారి అధికారం దక్కించుకుని తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రంగులుకుంటోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో తమదైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో టీడీపీ కూడా అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ అడ్డుకోవాలని చూస్తోంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. దీంతో రాబోయే ఎన్నికలను ప్రతిస్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తోంది.
జగన్ విశాఖలోని సబ్బవరంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించి నకిరేకల్ ఎమ్మెల్యే తండ్రి సంతాపసభలో పాల్గొంటున్నారు. దీంతో సీఎంల వైఖరిలో ఒక్కసారి మార్పు రావడంతో అందరు ఆసక్తి గా చూస్తున్నారు. వీరిద్దరు కలిసి ముందస్తుకేమైనా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.