KCR strategy: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ..తిరుగు లేని రాజకీయ శక్తిగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. ఆ దిశగా పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అధినాయకత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులను నియమించబోతున్నది. నిజానికి ఇప్పటికే అధ్యక్షులను నియమిచాల్సి ఉంది. కానీ, కేసీఆర్‌కు పనుల బిజీల వలన తీరిక లేదు. దాంతో ఎప్పటికప్పుడు ఈ నిర్ణయాలపై వాయిదా వేస్తున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ ఈ విషయాలపై న ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందర టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలు ఉన్నాయి. కానీ, అధ్యక్షులంటూ ఎవరు లేరు. ఇకపోతే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు లేని చోట కొందరిని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జిలుగా నియమించారు. వారు క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతలు తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు కూడా. ఇకపోతే గులాబీ పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల నియామక బాధ్యతలను సీఎం కేసీఆర్‌కే అప్పజెప్పుతూ తీర్మానాన్ని ఆమోదించారు. అలా పార్టీ రాష్ట్ర కమిటీని, జిల్లా అధ్యక్షులను కేసీఆర్ ఎంపిక చేయాల్సి ఉంది.
Also Read: KCR Modi: రాష్ట్రాలపై మోడీ మరో పిడుగు.. కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం
కేసీఆర్ ఇప్పుడు ఈ పనుల మీదపడి అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో పడ్డారట. క్షేత్రస్థాయిలో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకుగాను జిల్లా అధ్యక్షులు పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేర్చగల సమర్థత ఉన్న నాయకులకు పార్టీ రాష్ట్ర కమిటీలో, జిల్లా అధ్యక్షులు గా అవకాశాలివ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నామినేటెడ్ పదవులు లభించని వారికి కొందరికి ఈ దఫా అవకాశాలు ఇవ్వాలని, పార్టీ పదవుల ద్వారా వారిని సంతృప్తి పరచాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది పార్టీ సీనియర్ నేతలకు సైతం పార్టీ కీలక పదవులు ఇవ్వాలని పింక్ పార్టీ చీఫ్ అనుకుంటున్నట్లు టాక్. కేబినెట్ విస్తరణకు, పార్టీ పదవులకు లింక్ ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే విధంగా కీలకమైన నిర్ణయాలను కేసీఆర్ త్వరలో తీసుకోబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి..
Also Read: KCR Strategy: ముందస్తుతో ముడిపడ్డ మంత్రి వర్గ విస్తరణ.. కేసీఆర్ వ్యూహం ఇదే..!