Raveena Tandon: సినిమా వాళ్లకు రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. సినిమాల్లో కాస్త మంచి ఫేమ్ వస్తే చాలు వెంటనే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే, హీరోలతో పాటు హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. జయలలిత, విజయశాంతి దగ్గర నుంచి పేడ్ అవుట్ స్మాల్ హీరోయిన్ మాధవీలత వరకూ ఇలా చాలామంది భామలు రాజకీయం చేయాలని, రాజకీయ నేతగా ఎదగాలని ప్రయత్నాలు చేశారు.
అందులో, జయలలిత, జయసుధ, జయప్రద, రోజా లాంటి సక్సెస్ అయ్యారు కూడా. అయితే, తాజాగా రవీనా టాండన్ కూడా రాజకీయ ఎంట్రీ పై కొత్త ముచ్చట్లు చెప్పింది. తనకు ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ నచ్చలేదని బాలీవుడ్ నటి రవీనా టాండన్ చెప్పింది. పశ్చిమ బెంగాల్, పంజాబ్, ముంబయి నుంచి పోటీ చేసేందుకు తనకు ఆఫర్లు వచ్చాయని ఆమె వెల్లడించింది.
Also Read: ఆ వ్యూహాలను అమలు చేసే దిశగా కేసీఆర్ కసరత్తులు.. ఇప్పట్లో పూర్తి అయ్యేనా..?
అయితే.. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ తనను ఆకట్టుకోలేకపోయిందని, అందుకే ఇంకా రాజకీయాల్లోకి రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా.. ఆమె పలు విషయాలు పంచుకుంది. రాజకీయాల్లోకి రావాలని తనకూ ఉందని మనసులోని మాట బయటపెట్టింది. మొత్తానికి ఆమెకు ఏ పార్టీ నచ్చలేదట.
సోనూసూద్ కూడా మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని, ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చాడు.
Also Read: ఎల్ఐసీ పాలసీదారులకు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?