రాజకీయ పార్టీలు, నేతలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

దేశంలో నానాటికి రాజకీయ నేతల్లో నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంచే చేను మేసిన చందంగా చట్టాలు చేయాల్సిన వారే నేరస్తులైతే ఎలా అనే అనుమానాలు న్యాయవ్యవస్థలో తరుచుగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం అడుగులు వేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. […]

Written By: Srinivas, Updated On : August 11, 2021 11:57 am
Follow us on

దేశంలో నానాటికి రాజకీయ నేతల్లో నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంచే చేను మేసిన చందంగా చట్టాలు చేయాల్సిన వారే నేరస్తులైతే ఎలా అనే అనుమానాలు న్యాయవ్యవస్థలో తరుచుగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం అడుగులు వేసింది.

రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ర్ట ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినయోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని తెలిపింది. బిహార్ ఎన్నికలకు సంబంధించి గతంలోనూ ఈ తరహా తీర్పు ఇచ్చింది.

రాజకీయ పదవులకు ఎంపికైన అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించాలి. లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బయట పెట్టాలని తీర్పు వెలువరిచింది. తాజా తీర్పులో దాన్ని 48 గంటలకు పరిమితం చేసింది. పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాలు తెలపాల్సి ఉంటుంది.

అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తులను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో ఇచ్చిన ఆదేశాలను పార్టీలు పాటించనందున ఇవి కోర్టును ధిక్కరించినట్లు భావించాలని సూచించారు. కోర్టు ఆదేశాల్ని పాటించనందుకు సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కోర్టుకు క్షమాపణలు తెలియజేశాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది.