KCR In NTR Ghat: కేసీఆర్‌ ‘తారక’ మంత్రం.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు గులాబీనేత క్యూ..!! ఇన్నేళ్లకు ఎందుకు గుర్తొచ్చారు!?

KCR In NTR Ghat: తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని ఢీకొట్టిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిన మహానుభావుడు ఎన్టీఆర్‌. ఈ రోజు ఆ మహనీయుడి వంతో పుట్టిన రోజు. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, మన ఆత్మగౌరవాన్ని పెంచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఇన్నాళ్లకు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గుర్తొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. నందమూరి […]

Written By: Neelambaram, Updated On : May 28, 2022 4:16 pm
Follow us on

KCR In NTR Ghat: తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని ఢీకొట్టిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిన మహానుభావుడు ఎన్టీఆర్‌. ఈ రోజు ఆ మహనీయుడి వంతో పుట్టిన రోజు. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, మన ఆత్మగౌరవాన్ని పెంచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఇన్నాళ్లకు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గుర్తొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కేసీఆర్‌. ఎన్టీఆర్‌పై అభిమానంతో తన కొడుకుకు ఎన్టీఆర్‌ పేరు కూడా పెట్టుకున్నారు. 2001 వరకు టీడీపీలో కొనసాగిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ స్థాపించిన తర్వాత టీడీపీకి దూరమయ్యారు. మళ్లీ 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డిని ఓడించేందుకు టీడీపీతో పొత్తుపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత టీడీపీ భూస్థాపితం కోసం సర్వశక్తులు ఒడ్డిన కేసీఆర్‌ అనుకున్నది సాధించారు. ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఎన్టీఆర్‌ పేరు ఎత్తని కేసీఆర్‌కు సడెనగా ఇప్పుడు గుర్తురావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Sr NTR

ఎన్టీఆర్‌ ఘాట్‌కు గులాబీ నేతల క్యూ…

నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎన్టీఆర్‌ ఘాట్‌కు క్యూ కట్టారు. ఎనిమిదేళ్లుగా పసుపు జెండాలు రెపరెపలాడిన ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ప్రస్తుతం గులాబీ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్‌ ఆదేశం లేనిదే ఎక్కడికి వెళ్లని గులాబీ నేతలు, మంత్రులు, ఎంపీలు తాజాగా ఆయన సూచనలతోనే ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఎన్టీఆర్‌ఘాట్‌కు వెళ్లారని తెలుస్తోంది. ఫిలిమ్‌ నగరలో ఎన్టీ.రామారావు విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించారు. అయితే ఇంత సడన్‌గా ఎన్టీ.రామారావు గులాబీ అధినేతకు ఎందుకు గుర్తొచ్చారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.

KCR

ముందస్తు వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్‌ విజయం కోసం అన్ని మార్గాలు ఆన్వేషిస్తున్న కేసీఆర్‌ తాజాగా టీడీపీ అభిమానులు, క్యాడర్‌తోపాటు ఎన్టీఆర్‌ అభిమానులు, కమ్మ సామాజికవర్గం ఓటర్లు, తెలంగాణలోని ఆంధ్ర సెటిలర్లను మచ్చిక చేసుకునే ఎత్తగడ వేసినట్లు పొలిటికల్‌ టాక్‌. తెలంగాణలో ఇప్పటికే చాలా సామాజిక వర్గాలు టీఆర్‌ఎస్‌కు క్రమంగా దూరం అవుతున్నాయి. జీహె^Œ ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లు బీజేపీవైపు మొగ్గుచూపారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్ల ఓటుబ్యాంకును తమవైపు మళ్లించుకునేందుకే తాజాగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో టీఆర్‌ఎస్‌ నాయులు పాల్గొన్నారని తెలుస్తోంది.

60 లక్షల మంది సెటిలర్లు..

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఆంధ్రా సెటిలర్లు ఉన్నారు. హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో వీరికి ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్‌ తారక మంత్రం జపిస్తున్నారని తెలుస్తోంది.

25 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం..

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపు కనుమరుగైనప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్‌ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. సరైన లీడర్‌ లేకపోవడంతో ఎన్నికల్లో ఈ క్యాడర్‌ ఓట్లు చీలిపోతున్నాయి. కొంతమంది టీఆర్‌ఎసవైపు కొంతమంది కాంగ్రెస్‌వైపు, ఇంకొందరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మద్దతు దారులు పక్కచూపులు చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం గుర్తించారు. రాష్ట్రంలో దాదాపు 25 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. దీంతో టీడీపీ క్యాడర్‌ను, ఎన్టీఆర్‌ అభిమానులను మళ్లీ గులాబీ పార్టీవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఎన్టీఆర్‌ జయంతిని ఇందుకు అనువగా మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కమ్మ ఓటర్లకు గాలం..

తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఓట్లు తక్కువే ఉన్నాయి. అయితే ఉన్న ఓట్లు మాత్రం ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్నాయి. కమ్మ సామాజికవ వర్గానికి చెందిన మంత్రి పువ్వాడ అజయకుమార్‌ ఎన్ని తప్పులు చేసినా సామాజిక వర్గం టీఆర్‌ఎస్‌కు దూరం కాకూడదని మంత్రిని కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా, కమ్మ మంత్రి తీరుతో ఆ సామాజికవర్గం టీఆర్‌ఎస్‌కు దూరం అవుతోంది. దీనిని గ్రహించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాజాగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలకు సదరు మంత్రిని ఎన్టీఆర్‌ ఘాట్‌కు పంపించి కమ్మ ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Mahaanadu: మీ ఆవేశం పాడుగానూ.. మహిళా నేతల తొడలు గొట్టుడు చూసి చంద్రబాబు అవాక్కు!

తెలుగు దొంగల పార్టీ టీడీపీని అభివర్ణించిన కేసీఆర్‌..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గొంగలి పురుగును సైతం హత్తుకుంటామని తెలంగాణ సెంటిమెంట రగిల్చిన కేసీఆర్‌ 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ను ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ, సీసీఐ, టీఆర్‌ఎస్‌ భాగస్వాములయ్యాయి. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయం పరిణామాలు వేగంగా మారాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. స్వరాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీని స్వరాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు కేసీఆర్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. ఓటుకు నోటు కేసులు చంద్రబాబును ఇరికించి హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు పారిపోయేలా చేశారు. తర్వాత తెలంగాణలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయినప్పటికీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో పోటీకి ప్రయత్నించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ టీడీపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించారు. అయినా టీడీపీ కొన్ని స్థానాల్లో విజయం సాధించింది.

తృతీయ కూటమి నుంచి దృష్టి మళ్లించేందుకు..

సమయానుకూల రాజకీయాలు చేయడంలో కేసీఆర్‌ దిట్ట. ప్రస్తుత దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ, పంజాబ్, కర్నాటక వెళ్లొచ్చారు. బెంగాల్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే మమతా బెనర్జీ కేసీఆర్‌ను కలిసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో కూటమి వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో కేసీఆర్‌కు సడన్‌గా నందమూరి తారక రామారావు గుర్తొచ్చారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Also Read: Mahesh Babu : ‘సర్కారు’ 16 రోజుల కలెక్షన్స్.. ఇదే చివరి అవకాశం !
Recommended Videos:

Tags