https://oktelugu.com/

Visakhapatnam Commissionerate: సాగర నగరంలో నలిగిపోతున్న నాలుగో సింహం.. అసలేం జరుగుతోంది?

Visakhapatnam Commissionerate: ప్రశాంతతకు నెలవు సాగర నగరం విశాఖ. అందరి మనసులను దోచే అందమైన నగరం. అందుకే మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా పేరుంది. ఇక్కడ ఉద్యోగం చేయడానికి అధికారులు ఇష్టపడతారు. పిల్లల చదువులకు, ప్రశాంతంగా గడపడానికి అనువైన నగరంగా విశాఖను ఎంచుకుంటారు. అటువంటిది విశాఖలో పోస్టింగ్ అంటే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు. ఇక్కడ పనిచేయాలంటేనే వణికిపోతున్నారు. ఉద్యోగానికి వచ్చి బదిలీ అయ్యేలోపు ఏ ఛార్జ్‌ మెమో లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. విశాఖ కమిషనరేట్‌లో […]

Written By:
  • Dharma
  • , Updated On : May 28, 2022 / 03:23 PM IST
    Follow us on

    Visakhapatnam Commissionerate: ప్రశాంతతకు నెలవు సాగర నగరం విశాఖ. అందరి మనసులను దోచే అందమైన నగరం. అందుకే మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీగా పేరుంది. ఇక్కడ ఉద్యోగం చేయడానికి అధికారులు ఇష్టపడతారు. పిల్లల చదువులకు, ప్రశాంతంగా గడపడానికి అనువైన నగరంగా విశాఖను ఎంచుకుంటారు. అటువంటిది విశాఖలో పోస్టింగ్ అంటే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు. ఇక్కడ పనిచేయాలంటేనే వణికిపోతున్నారు. ఉద్యోగానికి వచ్చి బదిలీ అయ్యేలోపు ఏ ఛార్జ్‌ మెమో లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. విశాఖ కమిషనరేట్‌లో పనిచేయలేంటూ చాలామంది అధికారులు ఏకంగా దీర్ఘకాల సెలవులపై వెళ్ళిపోతున్నారు. పోలీసుశాఖలో ఎవరైనా ఒత్తడికి గురైనా, పై అధికారుల వేధింపులు ఉన్నా తమకు నేరుగా తెలియజేయమనే డైరక్టర్‌ జనరల్ ఆఫ్‌ పోలీసు ఉత్తర్వులు ఉత్తమాటేనని, అసలు సంగతి వారికి తెలుసని విశాఖ పోలీసులంటున్నారు.

    Visakhapatnam Commissionerate

    మూకుమ్మడి సెలవు

    విశాఖ నగరంలో ఐదురుగు ఏసీపీలు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 23 పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. 11 మంది ఏసీపీలు ఉన్నారు. ఇందులో వెస్ట్ , ఈస్ట్ , హార్బర్ , దిశా , ఎస్సీఎస్టీ సెల్ ఎసీపీలు సెలవులో ఉన్నారు. ఇక సౌత్ ఏసీపీ పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. ఒకేసారి ఐదుగురు ఏసీపీలు మూకుమ్మడి సెలవుల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది. ఈస్ట్ ఏసీపీ హర్షితకు డిసీపీ మధ్య ఓ కేసు విషయంలో వార్‌ నడిచిందని, ఈ విషయం తాను సీఎంతోనే తేల్చుకుంటానని చెప్పిన ఆమె మరుసటి రోజే సెలవుపై వెళ్ళిపోయారు. మరో మహిళ ఏసీపీ పరిస్థితి మరింత దారుణం. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉన్నారు. అయినా డ్యూటీ చేస్తున్నారు. ఇటీవల ఈమె పనిచేస్తున్న స్టేషన్‌కు పోలీస్ బాస్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. దీంతో ఆయన స్టేషన వీడి వెళ్ళే వరకూ దాదాపు గంటసేపు ఆమె నిలుచునే ఉండాల్సి వచ్చింది. దీంతో ఈమె కూడా మరుసటి రోజు సిక్ లీవ్ పై వెళ్లిపోయారట. మరోపక్క వెస్ట్ ఏసీపీ కూడా అధికారుల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లారని, అయినా ఉద్యోగంలో తక్షణమే చేరాలని అధికారులు ఆదేశించారని, ఒకవేళ చేరకపోతే తగిన చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

    Also Read: Supreme Court Commented Prostitution Is Occupation: వాళ్లూ మనుషులే… వారు చేసేది ఒక వృత్తే!! ఎందుకు వేధిస్తున్నారు!?

    కింది స్థాయి సిబ్బందిలో..

    ఇక కిందిస్థాయి సిబ్బందిది మరో గాథ. ఇటీవల కమిషనర్‌ కమిషనర్ శ్రీకాంత్ తనిఖీలకు వచ్చారు. ఆ సమయంలో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ క్యాప్ పెట్టలేదని, మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్ సిబ్బంది సివిల్ డ్రెస్ లో ఉన్నారంటూ ఇద్దరని వీఆర్ కు పంపారు. ఇదిలా ఉంటే… మీ స్టేషన్ పరిధిలో ఎంత మంది డిప్రెషన్ లో ఉన్నారు? పేరు, ఫోన్ నెంబర్ డిజీ కార్యాలయానికి మెయిల్ చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామంటూ ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్ లకు సందేశాలు అందాయి. ఇటీవల విజయనగరం ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య, కాకినాడ ఎస్ ఐ తుపాకీతో కాల్చుకోవడం, ఎచ్చర్లలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడాన్ని డిజీ కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. కానీ ఈ విషయంలో పోలీసులకు మరో అనుమానం తొలిచేస్తోంది. తమ పరిధిలో అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెపితే సమస్య పరిష్కారం కాకపోగా.మరింత ముదిరే ప్రమాదముందనుకుంటున్నారుట.

    పేరుకే వీక్లీ ఆఫ్..

    పోలీసుల వీక్లి హాఫ్ లు సక్రమంగా అమలు చేస్తే.. సగం సమస్య తీరేనట్టనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. విశాఖలో సెలవులపై వెళ్ళిన ఏసీపీలు వచ్చేవరకూ సీఐ, ఎస్‌ఐలకు వీక్లీ హాఫ్‌లు లేవని చెప్పేశారు. మరోపక్క గతంలో నైట్‌ రౌండ్స్‌లో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ళు ఉండేవారు. ఇప్పుడీ డ్యూటీ కేవలం ఎస్‌ఐలకే పరిమితం చేయడంతో వారు అల్లాడిపోతున్నారు. వారంలో నాలుగురోజులు కచ్చితంగా నైట్‌ రౌండ్స్‌ ఉంటుండంటతో డ్యూటీలు కష్టంగా ఉంటున్నాయని ఉన్నతాధికారులకు చెప్పుకున్నా ఫలితం ఉండటంలేదు. విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏసీపీల అర్థాంతర మూకుమ్మడి సెలవులు, సిబ్బంది కష్టాల వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకుంటే సరిపోతుందని, అంతేకానీ ఎవరు డిప్రెషన్‌కు గురవుతున్నారో మెయిల్‌ చేయండని చెప్పడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని పోలీసుసిబ్బందే అంటున్నారు. జనం ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు నిస్సహాయంగా బలవన్మారణాలకు పాల్పడటం ఆ శాఖ దుస్థితిని సూచిస్తోంది. మరి ఈ నాలుగో సింహం నవ్వేదెప్పుడు? వారి కష్టాలు తీరేదెప్పుడు?

    Also Read: Samantha Lip Lock: ఆ హీరోపై కోపంతోనే ఈ హీరోతో సమంత లిప్ లాక్ నా?
    Recommended Videos:

    Tags