కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పాత సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచి అన్ని పనులను కేసీఆర్ చక్కబెడుతున్న సంగతి తెల్సిందే. పాత సచివాలయ స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలోనే భూమిపూజ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పనికి బ్రేక్ పడింది.కొన్నినెలలుగా దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో కొత్త సచివాలయ […]

Written By: Neelambaram, Updated On : July 1, 2020 7:03 pm
Follow us on


సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పాత సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచి అన్ని పనులను కేసీఆర్ చక్కబెడుతున్న సంగతి తెల్సిందే. పాత సచివాలయ స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలోనే భూమిపూజ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పనికి బ్రేక్ పడింది.కొన్నినెలలుగా దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వానికి అడ్డంకులు తొలగాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక ఆలస్యంగా చేయకుండా త్వరగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతోంది. దీంతో ప్రతిపక్ష నేతలు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం ఉంటుందో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సుప్రీంలో ఆలస్యంగా పిటిషన్ దాఖాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండొదని విపక్ష నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈలోపు పనులు మొదలుపెట్టి సచివాలయాన్ని కూల్చివేస్తే ఇక చేసేదేమీ ఉందబోదని నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని పిటిషన్ దారులు మల్లగుల్లాలు పడుతోన్నారు.

మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఆధునిక సాంకేతిక ఉపయోగించి త్వరగా కూల్చివేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను అధికార యంత్రాంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలోనే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మాణానికి రూ.500కోట్ల రూపాయాలు ఖర్చవుతుందని అంచనా వేసింది. అన్నిహంగులతో సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా తెలంగాణ ఆదాయం భారీగా పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ గడిచిన మూడునెలలుగా సగం జీతంతోనే ప్రభుత్వం సరిపెట్టింది. ఇటీవల లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇప్పుడిప్పుడే తెలంగాణకు తిరిగి ఆదాయం సమకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.500కోట్లతో సచివాలయం నిర్మాణం చేపట్టానికి ముందుకొస్తే విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నలు లెవనెత్తే అవకాశం లేకపోలేదు.

మరోవైపు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం తెలంగాణకు మళ్లీ ఆదాయం వస్తుందని సచివాలయ నిర్మాణంలో పెద్దగా అడ్డంకులు ఉండబోవని చెబుతోంది. ఇలాంటి సమస్యలను సీఎం కేసీఆర్ అవలీలాగా చెక్ పెడుతారని వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కొత్త సచివాలయ నిర్మాణాన్ని ఎంతవరకు అడ్డుకుంటాయనేది వేచి చూడాల్సిందే..!