https://oktelugu.com/

తెలంగాణ ప్రభుత్వం మారదంతే..?

తెలంగాణ ప్రభుత్వం మారడం లేదు. స్వయంగా హైకోర్టు ఆదేశించినా మేమింతే అంటున్నారు. సీఎం కేసీఆర్ సార్.. అస్సలు తగ్గడం లేదు. అందుకే తాజాగా మరోసారి హైకోర్టు ఆగ్రహానిక గురయ్యారు. ఈసారి కొంచెం కఠినంగా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు పడ్డాయి. ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఇప్పుడు సామాన్యుల్లోనే కాదు.. హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది.. ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్ అసలు మొదట కరోనాపై యుద్ధం ప్రకటించి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2020 / 06:57 PM IST
    Follow us on


    తెలంగాణ ప్రభుత్వం మారడం లేదు. స్వయంగా హైకోర్టు ఆదేశించినా మేమింతే అంటున్నారు. సీఎం కేసీఆర్ సార్.. అస్సలు తగ్గడం లేదు. అందుకే తాజాగా మరోసారి హైకోర్టు ఆగ్రహానిక గురయ్యారు. ఈసారి కొంచెం కఠినంగా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు పడ్డాయి. ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఇప్పుడు సామాన్యుల్లోనే కాదు.. హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది..

    ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

    అసలు మొదట కరోనాపై యుద్ధం ప్రకటించి రోజూ ప్రెస్ మీట్ పెట్టి హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కాడి వదిలేశాడన్నది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. కరోనాను కంట్రోల్ చేయలేం అని చేతులెత్తేశాడా? తెలంగాణలో కరోనా టెస్టులు చేయమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం దేనికి సంకేతం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

    కరోనా తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తుంది. హైదరాబాద్ లో అయితే రోజుకు సగటున 1000 చొప్పున కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు హాట్ స్పాట్ గా హైదరాబాద్ తయారైంది. అలాంటి తెలంగాణలో కరోనా టెస్టులకు కేసీఆర్ స్వస్తి పలకడంపై తాజాగా హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా పరీక్షలను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలనే తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని.. అమలు చేయడం లేదని మండిపడింది. ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకపోతే ఈనెల 20న సీఎస్, వైద్యారోగ్య, మున్సిపల్ ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసింది.

    వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

    రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్ లో అరకొర సమాచారం పై ఇదివరకే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. తాజాగా హైకోర్టు చెప్పినా అమలు చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్ లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న హైకోర్టు.. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలని కోరింది. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించాలంది.

    ఇలా హైకోర్టు ఆదేశించినా.. హైదరాబాద్ రోగులు ఆస్పత్రుల్లో వసతులు లేక చనిపోతున్నామని వీడియోల్లో మొత్తుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు కేసీఆర్ సర్కార్ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశంతోనైనా తెలంగాణ సర్కార్ కరోనా టెస్టులు చేయడం.. అరికట్టడంపై దృష్టిసారిస్తుందో వేచిచూడాల్సి ఉంది.