KCR Strategies: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే పనిలో పడ్డారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశ వ్యాప్తంగా చేయాలని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలాఖరున జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు, మూడు సార్లు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిన ఆయన.. త్వరలో కార్యవర్గ సభ్యులు తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మొదట్లో కొత్త జాతీయ పార్టీ పెడుదామని అనుకున్న కేసీఆర్ ఆ తరువాత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయించారు. పలువురు నిపుణులను సంప్రదించిన తరువాత ఫైనల్ డెసిసిషన్ తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే విషయంపై కేసీఆర్ కేడర్ కు వివరించనున్నారు.
ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో పలు కార్యక్రమాల పేరిట ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ప్రణాళిక వేస్తోంది. కేంద్రానికి ప్రత్యామ్నాయంగా తామే నిలుస్తామని కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయించారు. ఈ పార్టీని ఈనెల 19న ప్రకటిస్తారని అన్నారు. కానీ మరో తేదీలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టేకన్నా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. ఈమేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారు.
Also Read: Govt Of AP Shocks Alcohol Drinkers: నచ్చింది కాదు ఇచ్చిందే తాగండి.. ఏపీ మందుబాబులకు సర్కార్ షాక్ లు
ఇదిలా ఉండగా ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశ వివరాలు బయటికి రాకున్నా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? అనే అంశాన్ని వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? పార్టీ నాయకులు వారితో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఆ పార్టీ ద్వారానే కేడర్ జనాల్లోకి వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రవేశం ద్వారా తెలంగాణకు మరించి ప్రయోజనం ఉంటుందని కేడర్ వివరించే అవకాశం ఉంది.
ఈ మేరకు త్వరలో పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తో దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతమైందని, ఇప్పుడు కొన్ని మార్చి వాటిని జాతీయస్థాయిలో తీసుకెళ్లేలా ప్లాన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ లాగే.. దేశంలో దక్షిణాది సెంటిమెంట్ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు సైతం దూకుడు మీద ఉండడంతో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
Also Read: Education System: 1998 డీఎస్సీ.. ఇప్పుడు టీచర్ ఉద్యోగం.. ఇదీ మన విద్యావ్యవస్థ తీరు