
నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న గులాబీ లీడర్లకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. వరుస ఎలక్షన్లే దీనికి కారణంగా తెలుస్తోంది. 2018డిసెంబర్లో రెండోసారి పవర్లోకి వచ్చిన టీఆర్ఎస్.. ఉద్యమ కాలం నాటి నేతలు, ఇతర పార్టీల నుంచి భారీగా వచ్చిన నేతలతో ‘ఓవర్ లోడ్’ అయిపోయింది. ఆశావహులు పెరిగిపోవడంతో గులాబీ బాస్ మనసులో ఏముందోనని నేతల్లో అంతర్మథనం మొదలైంది.
Also Read: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక: దూసుకొస్తున్న వాయు‘గండం’
రాష్ట్రంలో 54కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 40కార్పొరేషన్లకు కమిటీలు లేవు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవారెడ్డి తదితరుల పదవుల గడువు పొడిగించిన కేసీఆర్ మిగతా వాటిపై అంతగా ఫోకస్ పెట్టకపోవడంపై నేతలు నిరాశలో ఉన్నారు. ఇంకెప్పుడు ప్రకటిస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీకి వరుస ఎలక్షన్లే బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మొదలుకుని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు ఉండడంతో లేని లొల్లి కొనితెచ్చుకోవడమెందుకని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందరి సమన్వయంతో అన్నింటా గెలుపు జెండా ఎగురవేయాలని చూస్తున్నట్లు కనబడుతోంది.
Also Read: కేసుల చిక్కులు.. తెలంగాణ లీడర్లకు తిప్పలేనా?
పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో సేవలు చేస్తున్న నేతలు, ఇతర పార్టీల్లో మంచి పొజిషన్లో ఉండి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బెర్త్ దొరక్క ఇప్పటికే నారాజ్గా ఉన్నారు. కనీసం కార్పొరేషన్ కుర్చీ అయినా దక్కకపోతుందా అని ఎదురుచూస్తుంటే వరుస ఎలక్షన్లు వారి ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఇక చేసేదేముంది.. పెద్ద సారూ, చిన్న సారూ దృష్టిలో పడి మంచి మార్కులైన కొట్టేద్దాం.. కాలం కలిసిరాకపోతుందా అని ఆశల పల్లకిలో ఊరేగే పనిలో పడ్డారు.