ఒహోనా పెళ్లాంట.. ఆహాన పెళ్లాంట.. అని ప్రతీఒక్కరు జీవితంతో ఒక్కసారైనా పాడుకొని ఉండే ఉంటారు. అయితే సుధీర్-రష్మీ జంట మాత్రం లెక్కలెనన్నీ సార్లు పాడుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అనే పుకార్లు షికార్లు చేశారు. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరు పలుమార్లు ఖండించారు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి మరోసారి పెళ్లి పీఠలెక్కబోతుండటం ఆసక్తిని రేపుతోంది.
యాంకర్ కమ్ హీరోయిన్ రష్మి.. కామెడియన్ కమ్ హీరో సుధీర్ బుల్లితెరపై చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరు పాల్గొనే ప్రతీ షోలో వీరి మధ్య లవ్ ఉన్నట్లు చూపించడం ఇటీవల కామన్ అయిపోయింది. రష్మీని ఆకట్టుకునేందుకు సుధీర్ చేసే విన్యాసాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. రష్మి తిట్టినా.. కొట్టినా.. చీ పోరా ఎదవా అన్న కూడా సుధీర్ ఆమె వెంట పడుతుండటం నవ్వులుపూయిస్తూ ఉంటోంది.
బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో సుధీర్-రష్మి జంట పెళ్లి చేసుకొని శోభనం కూడా చేసుకున్న సీన్స్ చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లిపీఠలెక్కబోతున్నారు. ఈసారి ఓ సీనియర్ హీరోయిన్ వీరి పెళ్లిని దగ్గరుండి చేస్తుండటం విశేషం. దసరా సందర్భంగా ఈటీవీ తాజా ఓ స్పెషల్ కార్యక్రమం ప్లాన్ చేసింది. ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే కార్యక్రమంలో భాగంగా సీనియర్ హీరోయిన్ సంగీత.. హీరో నవదీప్.. యాంకర్ రష్మి.. వర్షిణి.. సుధీర్.. శేఖర్ మాస్టర్.. పలువురు సింగర్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోను ఈటీవీ తాజాగా విడుదల చేసింది. హీరోయిన్ సంగీత తన ఇద్దరు చెల్లెళ్లు(రష్మి.. వర్షిణీ) పెళ్లిళ్ల బాధ్యత తీసుకుంటుంది. పండగపూజ పూజ చేసేందుకు వచ్చిన వాళ్లలో మంచివాళ్లను సెలక్ట్ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే సుధీర్-రష్మి పెళ్లి వేడుక జరుగుతోంది. ఇక వర్షిణి.. శేఖర్ మాస్టర్ డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అదేవిధంగా నవదీప్ ‘సోది ఆపి దమ్ముంటే నన్నాపు’ అంటూ ఛాలెంజ్ విసరడం ఆకట్టుకుంటోంది.
ఇలా ఈ విజయదశమికి ‘అక్కా ఎవరే అతడాడు?’ షో బుల్లితెర ప్రేక్షకుల ఇంటికే పండుగ వాతావరణం తీసుకొచ్చేలా కన్పిస్తోంది. ప్రతీ పండుగకు స్పెషల్ కార్యక్రమం నిర్వహించడం ఇటీవల టీవీ చానళ్లకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఈటీవీ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుండటంతో ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకుల అత్రుతగా ఎదురుచూస్తున్నారు. రష్మి-సుధీర్ పెళ్లిని మరోసారి చూడాలంటే మాత్రం దసరా వరకు ఆగాల్సిందే..!