ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రాజకీయ నాయకుడు.. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారు. తనతో సమానులను ఎక్కడో కొట్టాలో కేసీఆర్ కు బాగా తెలుసు. కానీ తనను మించిన వారి విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా కేసీఆర్ కు తెలిసినట్టు మరెవరికీ తెలియదని అంటుంటారు.
Also Read: సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?
యావత్ దేశమే కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. తెలంగాణ కేసీఆర్ సర్కార్ అందులో విఫలమైందనడం అతిశయోక్తి అవుతుందేమో.. కానీ ఈ విపత్తుకు అందరూ బాధితులే.. సరైన చర్యలు తీసుకోకపోవడంలో కేసీఆర్ వైఫల్యం కనిపిస్తోంది. దేశంలోనా చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
అయితే తెలంగాణలో కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని ఏకంగా బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ సర్కార్ పరువును దేశవ్యాప్తంగా తీశాయి. బీజేపీ నియామక గవర్నర్లు అంతా ఆయా రాష్ట్రాల్లో పుల్లపెడుతూ వారిని ప్రశాంతంగా ఉండనీయని పరిస్థితులు చూస్తున్నాం. అయితే గవర్నర్ సూచించినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆమె ఆడిపోసుకున్నారు.
అయితే గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు మింగుడుపడడం లేదు.ఇప్పటికే హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏకంగా గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేసి డిలీట్ చేయడం దుమారం రేపింది. టీఆర్ఎస్ నేతలంతా లోపల గవర్నర్ తీరుపై కుతకుతలాడుతున్నారు.
Also Read: కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?
అయితే కేంద్రంలో మోడీ బలంగా ఉండడం.. ఆమె ప్రతినిధిగా గవర్నర్ తమిళిసై ఉండడం.. కేసీఆర్ సర్కార్ ఆమోదించే బిల్లులన్నీ ఆమె చేతికే వెళుతుండడంతో కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం వేస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోవాలని సూచిస్తోంది. వ్యాఖ్యలు పట్టించుకొని మాట్లాడితే దానిపై ప్రతిపక్షాలు మరింత ఆజ్యం పోసి దుమారం రేపి బీజేపీతో ఇబ్బందులు తెస్తాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.. అందుకే అవన్నీ వదిలేసి పనుల్లో ప్రభుత్వ నిబద్ధతను మాత్రమే చూపాలని కేసీఆర్ మౌనం దాల్చారట.. మౌనమే గవర్నర్ వ్యాఖ్యలకు మందు అని..అవే మరుగునపడిపోతాయని కేసీఆర్ భావిస్తున్నారు.