https://oktelugu.com/

నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ !

మొత్తానికి రూమర్సే నిజమయ్యాయి… నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని ఎట్టకేలకు మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఈ రోజు పూర్తి డిటైల్స్ తో అధికారిక ప్రకటన రానుంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ దాదాపు 45 కోట్ల భారీ మొత్తం ఆపర్ చేసి.. వి చిత్రబృందాన్ని కమిట్ చేయించింది. నిజానికి తమ సినిమాని చాలా కాలం ఓటీటీకి నేరుగా ఇవ్వకూడదని […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2020 / 10:21 AM IST
    Follow us on


    మొత్తానికి రూమర్సే నిజమయ్యాయి… నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని ఎట్టకేలకు మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఈ రోజు పూర్తి డిటైల్స్ తో అధికారిక ప్రకటన రానుంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ దాదాపు 45 కోట్ల భారీ మొత్తం ఆపర్ చేసి.. వి చిత్రబృందాన్ని కమిట్ చేయించింది. నిజానికి తమ సినిమాని చాలా కాలం ఓటీటీకి నేరుగా ఇవ్వకూడదని హోల్డ్ లో పెట్టినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మరో ఆప్షన్ లేక ఇక నేరుగా డిజిటల్ లోనే విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. లాక్ డౌన్ తరువాత వస్తోన్న మొట్టమొదటి పెద్ద సినిమా కావడంతో ఈ సినిమాకి వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది.

    Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !

    దాంతో నాని సినిమాకు ఓటీటీలో భారీ వ్యూవర్ షిప్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకి భారీగా వ్యూయర్ షిప్ వస్తే మాత్రం అమెజాన్ ప్రైమ్ వారు మరిన్ని పెద్ద సినిమాలను కొనుగోలు చేస్తారు. టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అయితే, అమెజాన్ వారే సీక్వెల్ ని నిర్మిస్తారట. మొత్తానికి ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి.. మిగతా సినిమాల మార్కెట్ అండ్ ఈ సినిమా సీక్వెల్ కూడా ఆధారపడి ఉంది. అంటే నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ అన్నమాట. ఇక ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ఇద్దరి పాత్రలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని.. మేకర్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.

    Also Read: పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం

    అయినా ఇంద్రగంటి వైవిధ్యం ఉంటేనే సినిమా చేస్తాడు, పైగా హీరోను చాలా సహజంగా చూపించడం ఆయన ప్రత్యేకత. అన్నిటికి మించి నానిని హీరోగా పరిచయం చేసింది ఆయనే. దానికి తోడు నానితో చేసిన రెండు సినిమాల్లోనూ నానిని డిఫ‌రెంట్‌ యాంగిల్ లో చూపించి నానికి రెండు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు నానిని విలన్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తూ.. నాని నటనా జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేయబోతుండటంతో ఈ సినిమా కోసం నాని కూడా బాగా ఆత్రుతగా ఉన్నాడు. అడగకుండానే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరో హీరో సుధీర్‌బాబు కూడా ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో కనిపించబోతున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.