టిడిపి అధినేత, ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ విషయమై నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పిల్ వేయించి చంకలు గుద్దుకుంటున్నారు. కోర్టు వారు… ఆరోపణలపై విచారణ జరిపించాలని అడగడం అనేది చంద్రబాబు విజయంగా టిడిపి పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కానీ అదే అతనిని నిట్టనిలువునా ముంచబోతోంది అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.
Also Read : అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?
అసలు కోర్టు విచారణ జరపడానికి ఆదేశించడమే చంద్రబాబుకు తీరని నష్టం చేకూరుస్తుంది. అదే జరగకపోతే… మూడున్నర ఏళ్ళ పాటు ఇవే ఆరోపణలు చేసుకుంటూ చంద్రబాబు కాలం గడిపేవారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో తప్పు జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు దాని పై విచారణ చేపట్టాల్సిన బాధ్యతగా రాష్ట్ర పోలీసు శాఖ సాక్షాలు అడిగారు. అవి లేవు కాబట్టే చంద్రబాబు “మీకు ఇప్పుడే నా లేఖలు కనబడ్డాయా…. నేను వైజాగ్ వచ్చినపుడు ఏం స్పందించలేదే…. మా నేతల అరెస్టు పట్టించుకోలేదే?” అని రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు జడ్జీలు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ కి గురి అయ్యాయని చంద్రబాబుకి ఎలా తెలిసింది? ఎవరైనా వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకున్నారా…. లేక ఇంకేదైనా కొత్త రహస్యాలను బయటపెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నాడా?
నిజంగానే చంద్రబాబు కి అంత నెట్ వర్క్ ఉంటే డిజిపి అడిగినప్పుడే దానికి సంబంధించిన కనీస సమాచారం బయటపెట్టాలి కానీ ఇలా సంబంధం లేని మాటలు మాట్లాడరు. ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణలో భాగంగా ట్యాపింగ్ కి గురైన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరు అని కోర్టు వారు ప్రశ్నిస్తారు. అప్పుడైనా సరే పిల్ వేసిన వారికి చివాట్లు తప్పవు. చంద్రబాబు ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడవలసి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ నుండి ఎంతటి ఖచ్చితమైన స్పందన వస్తుందని ఊహించి ఉండరు. అన్నీ ఆరోపణలు లాగానే వీటిని కూడా విస్మరిస్తారు అనే అనుకున్నారు కానీ ఆధారాలు ఉంటే ఇవ్వండి…. విచారణ చేస్తామని స్వయంగా రాష్ట్ర డిజిపి చెప్పిన మాట విని బాబు షాక్ అయ్యాడు. అంతే.. ఢిల్లీ కి పోస్ట్ పంపితే మీకెందుకు నొప్పి అని ఒక్కసారిగా ట్రాక్ మార్చాడు. చివరికి తనకి తెలియకుండానే ఇప్పుడు కార్నర్ అయిపోయాడు.
Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?