https://oktelugu.com/

KCR Politics: బీజేపీని విలన్ ను చేసేలా కేసీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్

KCR Politics: సీఎం కేసీఆర్ తెలంగాణ యాసలో ఎంత తిట్టినా వినసొంపుగా ఉంటాయి. ఆయన మాటల గారడీ అలాంటిది మరీ.. ఆయన బూతులు కూడా మంత్రాలుగానే వినపడతాయి. జనాన్ని మెస్మరైజ్ చేసే వాగ్ధాటి కేసీఆర్ సొంతం. ఇన్నాళ్లు మోడీని,. బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ కు అవి వర్కవుట్ కావన్న విషయం తెలిసిపోయింది. అందుకే రూట్ మార్చేశాడు. సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. తెలంగాణ కోసం ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ ఈ మంత్రం జంపించి సక్సెస్ అయ్యారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2022 / 06:20 PM IST
    Follow us on

    KCR Politics: సీఎం కేసీఆర్ తెలంగాణ యాసలో ఎంత తిట్టినా వినసొంపుగా ఉంటాయి. ఆయన మాటల గారడీ అలాంటిది మరీ.. ఆయన బూతులు కూడా మంత్రాలుగానే వినపడతాయి. జనాన్ని మెస్మరైజ్ చేసే వాగ్ధాటి కేసీఆర్ సొంతం. ఇన్నాళ్లు మోడీని,. బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ కు అవి వర్కవుట్ కావన్న విషయం తెలిసిపోయింది. అందుకే రూట్ మార్చేశాడు. సెంటిమెంట్ రగిలిస్తున్నాడు.

    తెలంగాణ కోసం ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ ఈ మంత్రం జంపించి సక్సెస్ అయ్యారు. 2014లో తెలంగాణ తెచ్చిన పార్టీగా.. ప్రజల కష్టాలు చూసిన పార్టీగా.. ఉద్యమాన్ని చేసిన పార్టీగా తమను ఆదరించాలని ప్రజల్లో సెంటిమెంట్ రగిలించారు. ఇంటిపార్టీ గెలిస్తేనే ఆగమైన తెలంగాణ బాగుపడుతుందని ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని కేసీఆర్ సృష్టించి సక్సెస్ అయ్యారు. విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ చేతుల్లోకి వెళితే ఆగమవుతుందని ప్రజలను నమ్మించారు. అలా 2014లో కేసీఆర్ ఇదే తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంతో విజయం సాధించారు.

    2018లోనూ కేసీఆర్ అస్త్రం ఇదే పనిచేసింది. నాడు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఆంధ్రా సీఎం చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి ప్రచారం చేశాడు. దీంతో కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ పైకి తీసుకొచ్చి రగిలించాడు. తెలంగాణలో పాలించేంది ఆంధ్రావాళ్లా? అంటూ చంద్రబాబును బూచీగా చూపించి కాంగ్రెస్ ను కాల్చేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ప్రజల్లో పలుచన అయిపోయిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.

    ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అదే సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. తెలంగాణలో ప్రధాన పోటీదారుగా మారిన బీజేపీని, మోడీ విధానాలను టార్గెట్ చేస్తే ఫలితం రాకపోవడంతో రూట్ మార్చేశాడు. మోడీని ఎంత తిట్టినా ప్రజలు నమ్మరని కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నాడు అదే సెంటిమెంట్ రాజేస్తున్నాడు.

    మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్ ప్రజలను భయపెట్టేలా మరోసారి సెంటిమెంట్ మాటలు మాట్లాడాడు. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి పోషించేలా వ్యాఖ్యానించాడు. ‘ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లు గోసపడ్డామని.. దేశంలో కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని.. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టమని.. జాతీయ నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఉన్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ బీజేపీ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత నూరిపోసేలా మాట్లాడారు. ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ గోసపడుతామని బీజేపీని గెలిపించవద్దని పరోక్షంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో దగాపడ్డామని.. ఇప్పుడు బీజేపీ వల్ల మరోసారి విద్వేష తెలంగాణ ఏర్పడుతుందని కేసీఆర్ హెచ్చరికలు చేస్తున్నారు.

    ఇలా బీజేపీని ఓడించడానికి సామాధాన బేధ దండోపాయాలను కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. బీజేపీ అంటేనే జనాల్లో భయం కలిగేలా… వారి పాలన వస్తే అంశాంతి నెలకొంటుందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీన్ని క్రమంగా ఎన్నికల వరకూ మరింతగా రెచ్చగొట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ దీన్ని ఎలా తిప్పి కొడుతుందన్నది వేచిచూడాలి.