NTR Arogya Ratham: నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పేదల కోసం ఉచిత వైద్యం అందించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓ రథాన్ని సిద్ధం చేశారు. రూ.40 లక్షలు ఖర్చు చేసి దీన్ని తయారు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేడు దీన్ని ప్రారంభించి ప్రజలకు సేవలు చేయాలని సూచించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. ప్రచార రథంపై తన ఫొటోతోపాటు తన తండ్రి ఫొటోను ముద్రించారు. ఎక్కడ కూడా చంద్రబాబు ఫొటో లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
దీంతో రాజకీయ వర్గాల్లో వాదనలు మొదలయ్యాయి. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో తన సొంత నిధులతో వాహనం తయారు చేసినా కనీసం బావ ఫొటో లేకుండా చేయడంపై చర్చనీయాంశం అవుతోంది. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ వాహనం అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 200 జబ్బులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి అక్కడే వైద్యం చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
Also Read: KTR Modi: మోడీని లాజిక్ తో కొట్టిన కేటీఆర్..
వాహనంపై చంద్రబాబు ఫొటో లేకుండా చేయడంలో బాలకృష్ణ ఉద్దేశమేమిటనే విషయం అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో టీడీపీ నేతల్లోనే అంతర్మథనం జరుగుతోంది. బాలకృష్ణ నిర్ణయం దేనికి నిదర్శనంగా నిలుస్తోందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్య బావను ఎందుకు దూరం పెడుతున్నారు? పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాబు ఫొటో లేకుండా వాహనం తయారు చేయించి తానేమిటో నిరూపించుకుంటున్నా బావ ఫొటో లేకుండా చేసి అందరిలో ఆశ్చర్యం కలిగేలా చేస్తున్నారనడంలో సందేహం లేదు.
హిందూపురంలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. మూడో సారి గెలిచి ఎమ్మెల్యేగా తన స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే పేదలకు ఉచితంగా వైద్య సేవలందించి వారి మన్ననలు చూరగొనాలనే చూస్తున్నారు. దీంతోనే హిందూపురంలో తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. మొత్తానికి బాబుకు ఏం ఝలక్ ఇస్తారోననే సందేహం అందరిలో వస్తోంది. బాలయ్య చేసిన పనికి పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.