వైఎస్ షర్మిలకు షాకిచ్చిన కేసీఆర్

అనువుగాని చోట అధికులం అనరాదు అన్నది ఫేమస్ నానుడి. అయితే ఎంత అనువుగా లేకున్నా రాజకీయం చేస్తానని ముందుకొచ్చింది వైఎస్ షర్మిల.. అంతేకాదు.. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ నే ఢీకొట్టింది. కేసీఆర్ పెడచెవిన పెట్టిన ఉద్యోగాలు, నిరుద్యోగాన్నే అస్త్రంగా ఎంచుకుంది. అదే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. వైఎస్ షర్మిలకు షాకిచ్చేలా తయారైంది. అటు ఖమ్మం సభలో.. ఇటు ఇందిరాపార్క్ వద్ద దీక్షలో వైఎస్ షర్మిల టార్గెట్ ఏవరో క్లియర్ కట్ గా […]

Written By: NARESH, Updated On : April 28, 2021 10:29 am
Follow us on

అనువుగాని చోట అధికులం అనరాదు అన్నది ఫేమస్ నానుడి. అయితే ఎంత అనువుగా లేకున్నా రాజకీయం చేస్తానని ముందుకొచ్చింది వైఎస్ షర్మిల.. అంతేకాదు.. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ నే ఢీకొట్టింది. కేసీఆర్ పెడచెవిన పెట్టిన ఉద్యోగాలు, నిరుద్యోగాన్నే అస్త్రంగా ఎంచుకుంది. అదే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. వైఎస్ షర్మిలకు షాకిచ్చేలా తయారైంది.

అటు ఖమ్మం సభలో.. ఇటు ఇందిరాపార్క్ వద్ద దీక్షలో వైఎస్ షర్మిల టార్గెట్ ఏవరో క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఆమె తెలంగాణలో కేసీఆర్ సర్కారునే ఢీకొంటుందని అర్థమైంది. కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా రాజకీయం చేస్తోంది.

ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిలను ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే ఆమెకు ఇచ్చిన గౌరవాన్ని భద్రతను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది.

తాజాగా వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. ఆమెకు ఇచ్చిన నలుగురు గన్ మెన్ల భద్రతను తాజాగా ఉపసంహరించుకుంది. షర్మిల ప్రతీసారి రోడ్డెక్కుతుండడంతో ఇక నుంచి ఆచితూచీగానే కదలాల్సి ఉంటుంది. భద్రత లేకపోవడం ఇష్టానుసారం బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. రోడ్డెక్కి నిరసన తెలుపాలన్న కాస్తా ఆలోచించాలి. అలా దూకుడుగా వెళుతున్న షర్మిలమ్మ ముందరికాళ్లకు బంధం వేసినట్టు కనిపిస్తోంది. షర్మిల భద్రతను కట్ చేసి కేసీఆర్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు.