G-20 KCR : రోజురోజుకి ఒంటరవుతున్న కేసీఆర్

G-20 KCR : జీ20 శిఖరాగ్ర సమావేశ సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఒక కార్యక్రమం నిర్వహించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భాగంగా అత్యున్నత సమావేశానికి జగన్, చంద్రబాబులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నుంచి కేంద్ర పెద్దల వరకూ ఇద్దరు నేతలను బాగానే ఆదరించారు. అప్యాయంగా పలకరించారు. ప్రధాని మోదీ ఇద్దరి నేతల నుంచి ఏపీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ కీలకమైన సమావేశానికి […]

Written By: NARESH, Updated On : December 7, 2022 9:53 pm
Follow us on

G-20 KCR : జీ20 శిఖరాగ్ర సమావేశ సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఒక కార్యక్రమం నిర్వహించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భాగంగా అత్యున్నత సమావేశానికి జగన్, చంద్రబాబులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నుంచి కేంద్ర పెద్దల వరకూ ఇద్దరు నేతలను బాగానే ఆదరించారు. అప్యాయంగా పలకరించారు. ప్రధాని మోదీ ఇద్దరి నేతల నుంచి ఏపీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

ఈ కీలకమైన సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. దీన్ని బట్టి దేశంలోనే కేసీఆర్ ఒంటరి అయిపోతున్నారు. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వైరుధ్యం తీవ్రంగా ఉంది. మోడీ అంటేనే కేసీఆర్ శత్రువులా చూస్తున్నారు. ఆయన చర్యలు రోజురోజుకు అహంకారపూరితంగా తయారవుతున్నాయి. చిన్న పిల్లల చేష్టలుగా ఉన్నాయా? అర్థం కావడం లేదు.

కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలకు ప్రతినిధి. ఆయన వ్యక్తిగత ఆవేశాలకు ప్రజలను బలి చేయవద్దు. జీ20 సమావేశాలకు సన్నాహకంగా నిర్వహించే ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దీని ద్వారా ఎన్నో జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి కంటే ప్రభావశీలమైనది జీ20 సమావేశాలు. అంతటి ముఖ్యమైన ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

మోడీని వ్యతిరేకించే నేతలందరూ ఈ సమావేశానికి వెళితే కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. రోజురోజుకి ఒంటరవుతున్న కేసీఆర్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.