BJP: బీజేపీకి భయపడని కేసీఆర్.. జగన్‌కు భయమా?

BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు స్పష్టంగానే వ్యతిరేక మార్గం ఎంచుకున్నారు. కాగా, మరొకరు మాత్రం బీజేపీని వ్యతిరేకించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపైన గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ అనుకూల వైఖరిలో ఉన్నట్లు కనబడుతుంది. అయితే, గత కొంత కాలం నుంచి మోడీని ఎదిరించాలంటే ఆ నేతకు చాలా ధైర్యం ఉండాలని, ఆయన తనను ఎదిరించిన వారిని […]

Written By: Mallesh, Updated On : February 4, 2022 5:33 pm
Follow us on

BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు స్పష్టంగానే వ్యతిరేక మార్గం ఎంచుకున్నారు. కాగా, మరొకరు మాత్రం బీజేపీని వ్యతిరేకించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపైన గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ అనుకూల వైఖరిలో ఉన్నట్లు కనబడుతుంది. అయితే, గత కొంత కాలం నుంచి మోడీని ఎదిరించాలంటే ఆ నేతకు చాలా ధైర్యం ఉండాలని, ఆయన తనను ఎదిరించిన వారిని ప్రభావితం చేయగలడని ప్రచారం ఉంది. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టంగానే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.

BJP and KCR

బీజేపీ తనను ఎదిరించే రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతుందని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీపైన కాని బీజేపీ పైన కాని విమర్శలు చేయబోరని అంటుంటారు. కాగా, తెలంగాణ సీఎం మాత్రం అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. ఇదే స్థాయిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎందుకు స్పందించడం లేదన్న చర్చ ఉంది.

కేంద్ర బడ్జెట్ పైన తెలంగాణ సీఎం స్పందన అందరికీ తెలిసింది. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం కనీస మాత్రంగానైనా విమర్శ చేయలేదు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీలపైన ప్రశ్నించకపోవడానికి గల కారణాలు ఆయన పైన ఉన్న కేసులేనా? అన్న చర్చ జరుగుతున్నది. ఇకపోతే గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తనకు సహకరిస్తారని అంచనా మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ పల్లెత్తు మాట అనడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also Read: ప్లాన్లు అన్నీ ఫెయిల్.. పీఆర్సీ చిక్కుముడిలో జగన్.. బయటపడేనా?

ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ నత్వానీని ఏపీ నుంచి రాజ్య సభకు వైసీపీ పంపిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఖాళీ అయ్యే రాజ్య సభ స్థానాల్లో బీజేపీ సూచించే వారిని జగన్ పంపాలని అనుకుంటున్నరామోననే వార్తలొస్తున్నాయి. మొత్తంగా ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి భయపడుతున్నారా? అనే చర్చ ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జైలుకు వెళ్తారని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ తరచూ ఆరోపిస్తుంటారు. కాగా, వాటిని సీఎం కేసీఆర్ అస్సలు పట్టించుకోకుండా ఇంకా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం. చూడాలి మరి.. భవిష్యత్తులో కేసీఆర్ జైలుకు వెళ్తాడా.. సీఎం జగన్ ఒక్కసారైనా బీజేపీ వ్యతిరక వైఖరి తీసుకుంటారా.. అనేది భవిష్యత్తులోనే తెలుస్తుంది.

Also Read: కేసీఆర్ ను నమ్మి అనుభవించా.. జగన్ కుర్రాడు ఆ తప్పు చేశాడు.. నారాయణ సంచలనాలు

Tags