Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ రాజుకుంటోంది. ఈనెల 7 నుంచి సమ్మె చేయాలనే ఉద్యోగులు నిర్ణయించుకోవడంతో ప్రభుత్వం ఆందోళనలో పడుతోంది. సమ్మెను ఎలాగైనా మానిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు వినేలా లేదు. దీంతో ప్రభుత్వానికి గుదిబండలా మారింది. పాత పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోఉలు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లిస్తోంది. దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి సమస్యలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమ్మె అనివార్యమయ్యే అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు గురువారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా ఉద్యోగులు విజయవాడ చేరుకోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అసలు ఏం జరిగిందనే దానిపై సమీక్షించుకుంటోంది. వారికి పోలీసులు కూడా సహకరించారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే పీఆర్సీలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. దీంతోనే వారిని చూసీచూడనట్లుగా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: బీజేపీకి భయపడని కేసీఆర్.. జగన్‌కు భయమా?
పోలీసుల సాయంపై సర్కారు కూడా ఆందోళన చెందుతోంది. ఉద్యోగులు సమ్మె చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చలు జరుపుతోంది. ఉద్యోగుల డిమాండ్లు తీరిస్తే పోయేదాన్ని పట్టుకుని వారితో ఎందుకు పెట్టుకున్నామనే ఆలోచనలో పడిపోతోంది. ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రంలో పనులు స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. దీనిపై ఉద్యోగులు కూడా పట్టు వీడటం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాల్సిందేనని చెబుతున్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై న్యాయ నిపుణుల సహాలు, సూచనలు తీసుకుంటోంది. ఉద్యోగుల సమ్మెను వారించే క్రమంలో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన బాట పట్టినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు ఎలా చేరుకున్నారనే దానిపై ఆరా తీస్తోంది. ఉద్యోగులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం మరోమారు ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తోంది. ఎలాగైనా ఉద్యోగులను తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నా వారు మాత్రం ససేమిరా అంటున్నారు.
Also Read: ప్లాన్లు అన్నీ ఫెయిల్.. పీఆర్సీ చిక్కుముడిలో జగన్.. బయటపడేనా?