ఎప్పుడు.. ఎంత ప్రకటించాల్నో కేసీఆర్‌కు‌ తెలుసట

నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి మీద చర్చ నడిస్తే.. ఇప్పుడు తాజాగా పీఆర్సీ దుమారం రేపుతోంది. ఫిట్‌మెంట్‌పై వేసిన కమిటీ 7.5 శాతం పీఆర్సీ ప్రకటించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే.. టీఆర్‌‌ఎస్‌ వర్గాలు మాత్రం మరొలా చెబుతున్నాయి. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఇప్పటికే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని, ఫాంహౌస్‌ నుంచి రాగానే ప్రకటిస్తారని అంటున్నాయి. అయితే.. ఉద్యోగ సంఘాల కూడా ఎక్కడా కేసీఆర్‌‌పై విమర్శల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే.. గతంలోనూ కేసీఆర్‌‌ […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 11:27 am
Follow us on


నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి మీద చర్చ నడిస్తే.. ఇప్పుడు తాజాగా పీఆర్సీ దుమారం రేపుతోంది. ఫిట్‌మెంట్‌పై వేసిన కమిటీ 7.5 శాతం పీఆర్సీ ప్రకటించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే.. టీఆర్‌‌ఎస్‌ వర్గాలు మాత్రం మరొలా చెబుతున్నాయి. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఇప్పటికే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని, ఫాంహౌస్‌ నుంచి రాగానే ప్రకటిస్తారని అంటున్నాయి. అయితే.. ఉద్యోగ సంఘాల కూడా ఎక్కడా కేసీఆర్‌‌పై విమర్శల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే.. గతంలోనూ కేసీఆర్‌‌ ఇలాంటి జిమ్మిక్కులనే యూజ్‌ చేశారు. ఆర్టీసీ విషయంలో అడిగిన దానికంటే ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. తమ విషయంలోనూ అలాగే జరగవచ్చని ఆశతో ఉన్నారు.

Also Read: నిమ్మగడ్డ మెడకు ‘మేనిఫెస్టో’ పంచాయితీ

ఈ నెలాఖరులోగా ఉద్యోగులను సంతృప్తి పరిచేలా ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తారని సమాచారం. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా ఇతర సమస్యలను పరిష్కరించి అందరినీ సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అయినట్లు సమాచారం. ఇదే జరిగితే కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేందుకు కూడా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు.

బీజేపీ నేత బండి సంజయ్ కూడా పాలాభిషేకాల కోసమే కొత్త నాటకాలని విమర్శిస్తున్నారు. రేపోమాపో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. అలాగే నిరుద్యోగ భృతిని కూడా ప్రకటిస్తారని కేటీఆర్ చెప్పారు. త్వరలో కేటీఆర్‌కు పట్టాభిషేకం జరగబోతోందనే ప్రచారం మధ్య అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నాల్లో కేసీఆర్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Also Read: మెగాస్టార్‌‌ మద్దతూ మా కూటమికే..: సోము కీలక వ్యాఖ్యలు

కానీ.. సీఎస్ సోమేష్ కుమార్ మాత్రం ఆర్థిక పరిస్థితిని ..తనను కలుస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు వివరిస్తున్నారు. ఇప్పటికి ఇంతే అని చెబుతున్నారు. ఒకవేళ కేసీఆర్ ఈ సారి ఉద్యోగులకు షాకివ్వాలనుకుంటే అంతే ఉంటుంది. అందుకే ఉద్యోగ సంఘ నేతలు కొంత టెన్షన్ పడుతున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌కు ఎప్పుడు ఎండ్‌ కార్డు పడుతుందా అని అందరూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్