https://oktelugu.com/

ఆగస్టు నెలలో శర్వానంద్ ‘మహా సముద్రం’

ఏంటిది… మాకేంటిది… గ్యాప్ లేకుండా ఇన్నిన్ని సినిమాలు రిలీజ్ చేస్తే… ఏ సినిమా చూడాలి, ఎన్ని సినిమాలు చూడాలని సగటు సినిమా అభిమాని ఆనందంతో కూడిన ఆవేదన వెళ్లగక్కుతున్నాడు. నిన్న చూస్తే రెండు సినిమాల విడుదల తేదీలు ప్రకటించి ఆశ్చర్యపరిచారు నిర్మాతలు. రేపు మరో రెండు మూడు సినిమా డేట్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. గతేడాది కరోనా గట్టిగా దెబ్బేయటంతో ఇప్పుడు అందరూ తమ సినిమాల్ని చక చకా విడుదల చేసి కొత్త ప్రాజెక్ట్స్ మీదకి షిఫ్ట్ […]

Written By:
  • admin
  • , Updated On : January 29, 2021 / 11:41 AM IST
    Follow us on


    ఏంటిది… మాకేంటిది… గ్యాప్ లేకుండా ఇన్నిన్ని సినిమాలు రిలీజ్ చేస్తే… ఏ సినిమా చూడాలి, ఎన్ని సినిమాలు చూడాలని సగటు సినిమా అభిమాని ఆనందంతో కూడిన ఆవేదన వెళ్లగక్కుతున్నాడు. నిన్న చూస్తే రెండు సినిమాల విడుదల తేదీలు ప్రకటించి ఆశ్చర్యపరిచారు నిర్మాతలు. రేపు మరో రెండు మూడు సినిమా డేట్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. గతేడాది కరోనా గట్టిగా దెబ్బేయటంతో ఇప్పుడు అందరూ తమ సినిమాల్ని చక చకా విడుదల చేసి కొత్త ప్రాజెక్ట్స్ మీదకి షిఫ్ట్ అవ్వాలని తహతహలాడుతున్నారు.

    Also Read: ట్రైలర్ టాక్: ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ థ్రిల్లింగ్ రైడ్

    ఆర్ఎక్స్ 100 లాంటి సంచలన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు అజయ్ భూపతి నుండి ఎలాంటి సినిమా వస్తుందో అని అభిమానులందరూ ఎదురు చూసారు. అయితే ఈయన దాదాపుగా మూడేళ్ళ తర్వాత శర్వానంద్ మరియు సిద్దార్థ్ కాంబినేషన్లో ‘మహా సముద్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ అధితి రావు హైదరి కనువిందు చేయబోతుంది.

    Also Read: సమ్మర్ కి సిద్దమైన మరో రెండు సినిమాలు

    మహా సముద్రం విడుదల తేదీ విషయంలో నిర్మాత అనిల్ సుంకర్ ముందు జాగ్రత్త పడుతూ ఆగస్టు 19వ డేట్ ని లాక్ చేస్తున్నారట. ఇప్పటికే పుష్ప సినిమా ఆగస్టు 13న, ఎఫ్ 3 సినిమా ఆగస్టు 27న విడుదల కాబోతుండగా మధ్య ఉన్న వారం గ్యాప్ లో ఈ సినిమాని విడుదల చేసి సేఫ్ అవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయం మీద రేపు లేదా ఆదివారం అధికారకంగా ప్రకటన రానున్నది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్