KCR Job Notification Announcement: తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ ఎంత కాలం పడుతుందో అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. ప్రభుత్వం మరో రెండేళ్ల సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి కూడా నోటిఫికేషన్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల ఆశలు ఇప్పట్లో తీరేనా అనే అనుమానాలు వస్తున్నాయి.
దాదాపు 80 వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఇంత పెద్ద మొత్తంలో భర్తీ ప్రక్రియ చేపట్టడం ఈజీ కాదని తెలియడంతో టీపీఎస్పీతో పాటు మరో బోర్డు ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇంకా సమయం పట్టే అవకాశముంది. గ్రూప్స్ ఉద్యోగాలు టీఎస్పీఎస్పీ ద్వారా చేపడుతున్నా మిగతా ఉద్యోగాలు మాత్రం బోర్డు ద్వారా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ ఉద్యోగాలతో పాటు ఇంజినీరింగ్ ఉద్యోగాల నియామకం సైతం చేపట్టేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
Also Read: Teaching Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
ఇదివరకే సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఏవీ కూడా ఆచరణకు నోచుకోకపోవడంతో దీనిపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నా నెరవేరేందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది.
అసెంబ్లీ సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా నిరుద్యోగులు మాత్రం సంతృప్తి చెందేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నోటిఫికేషన్లు వెలువరించేందుకు ఇంకా సమయం పట్టేలా ఉండటంతో నిరుద్యోగులకు మాత్రం నమ్మకం రావడం లేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల ఆశలు ఇప్పట్ల తీరేనా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇప్పటికే పలు రకాల హామీలు ఇచ్చి వాటిని విస్మరించడంతో కేసీఆర్ ప్రకటనను విశ్వసించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఎంత కాలం తీసుకుంటారో తెలియడం లేదు. నిరుద్యోగుల ఆశలు నెరవేరేందుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారో8 స్పష్టత రావడం లేదు.
Also Read: ప్రగతిభవన్ ఆఫీసర్లపై టీఆర్ ఎస్ అనుమానం.. ఆ పని చేస్తున్నారంట..