https://oktelugu.com/

Athadu Movie Child Artist: అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడండోయ్..

Athadu Movie Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సినీ హీరోగా మారిన ఘటనలు మనం అనేకం చూశాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. అతడు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ప్రతి సీను ప్రతి డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఇందులోని డైలాగ్స్ తో ఇప్పటికీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. అయితే ఇందులో బ్రహ్మానందం […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 13, 2022 / 02:45 PM IST
    Follow us on

    Athadu Movie Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సినీ హీరోగా మారిన ఘటనలు మనం అనేకం చూశాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. అతడు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ప్రతి సీను ప్రతి డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఇందులోని డైలాగ్స్ తో ఇప్పటికీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నెటిజన్లు.

    అయితే ఇందులో బ్రహ్మానందం కొడుకుగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్. బ్రహ్మానందం ఇంటికి రాగానే నాన్న నాకు ట్రైన్ తెచ్చావా అని అడుగుతాడు.. దానికి బ్రహ్మానందం సెటైరికల్ గా రైల్వే స్టేషన్ లో ఉంది వెళ్లి తెచ్చుకో అంటూ చెప్తాడు. ఈ డైలాగు కూడా చాలా ఫేమస్. అయితే ఈ బుడ్డోడు ఆర్య, లెజెండ్, పెదబాబు లాంటి సినిమాల్లో కూడా నటించాడు.

    Also Read:  ‘రాధేశ్యామ్’ మిక్స్ డ్ టాక్ అని ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య

    ఇతని పేరు దీపక్ సరోజ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 సినిమాలకు పైగా నటించిన ఇతగాడు.. ఆ తరువాత చదువు కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక 2014 లో మిణుగురులు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతను కీ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇందులో దీప‌క్ న‌ట‌న అమోఘం అనిపించింది. ఆ త‌ర్వాత అత‌నికి హీరోగా కూడా అవ‌కాశాలు తెచ్చిపెట్టింది ఆ పాత్ర‌.

    Athadu Movie Child Artist

    హీరోగా తొలిసినిమా బంధనం మూవీతో పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా.. దీపక్ నటనకు మంచి పేరు తెచ్చింది. దీని తర్వాత కూడా మరిన్ని సినిమాలు చేసేందుకు అతను ప్లాన్ చేసుకుంటున్నాడు. గ‌త బిగ్ బాస్-5 సీజన్ లో కూడా అతను పాల్గొంటాడని టాక్ వచ్చినా.. ఎందుకో అతను పాల్గొనలేదు. ఇక ప్రస్తుతం సినిమాలపైనే తన పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

    Athadu Movie Child Artist

    త్వ‌ర‌లోనే పెద్ద సినిమాతో రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి చైల్డ్ ఆర్టిస్టులు గ‌తంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా మారారు. ప్ర‌స్తుతం తేజ కూడా ఇలాగే ఉన్నాడు. మ‌రి దీప‌క్ అలాగే ఫేమ‌స్ అవుతాడా లేడా అన్న‌ది వేచి చూడాలి.

    Also Read:  సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు
    Recommended Videos


    Tags