https://oktelugu.com/

ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. కేంద్ర సడలింపుల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు పరిమిత రూట్లలో పరిమితంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తోంది.ఈ మేరకు అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే బస్సుల్లో 50 శాతం ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా అన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 18, 2020 / 07:15 PM IST
    Follow us on

    తెలంగాణలో కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. కేంద్ర సడలింపుల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు పరిమిత రూట్లలో పరిమితంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తోంది.ఈ మేరకు అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    అయితే బస్సుల్లో 50 శాతం ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా అన్ని జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

    ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ కు వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకే అనుమతించనున్నారు. వరంగల్‌ వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి, నల్గొండ వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి అలాగే మహబూబ్‌ నగర్‌ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

    అయితే ప్రస్తుతానికి అంతర్‌ రాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇక ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావాలంటే డిపోల్లో థర్మల్‌ స్క్రీన్‌ తప్పని చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.