Visakha Steel Plant : అనుకున్నదే జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో సింగరేణి తరఫునుంచి బిడ్ దాఖలు కాలేదు. గడువు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ గురువారం సాయంత్రం వరకు ఆసక్తి వ్యక్తీకరణకు సంబంధించి ఎటువంటి ప్రకటన, బిడ్ దాఖలు చేయకపోవడంతో కెసిఆర్ అసలు రూపం ఆంధ్ర ప్రజలకు అవగతమైంది. భారత రాష్ట్ర సమితి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పాగా వేసేందుకు మాత్రమే బిడ్ నిర్ణయం తీసుకున్నారని, అది కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని ఆంధ్ర ప్రజలకు అర్థమైంది.
వాస్తవానికి ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముడి పదార్థాల సమీకరణ కోసం బిడ్లు ఆహ్వానించింది. ప్రభుత్వ సంస్థలకు ఇందులో పాల్గొనే అవకాశం లేదని స్పష్టంగా చెప్పింది. దీంతో కెసిఆర్ వెంటనే సింగరేణి తరఫున ఇందులో పాల్గొంటామని సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు సింగరేణి అధికారులను విశాఖ ఉక్కు కర్మాగారం పరిశీలించేందుకు పంపించాడు. దీంతో కేసీఆర్ కు పొలిటికల్ గా మైలేజ్ వచ్చింది. ఉక్కు ఫ్యాక్టరీ ఎదుట భారత రాష్ట్ర సమితికి సంబంధించిన జెండాలు ఏర్పాటయ్యాయి. ఇక భారత రాష్ట్ర సమితి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మంత్రి హరీష్ రావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులను విమర్శించారు. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ అయితే కేంద్రానికి ఏకంగా లేఖ కూడా రాశారు. ఇక నమస్తే తెలంగాణ విపరీతమైన హడావిడి చేసింది.. ఈ క్రమంలోనే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కేసీఆర్ ను పొగుడుతూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒక సంస్థ అయితే ఎంత కావాలంటే అంత ఇస్తానని విశాఖ కర్మగారానికి ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే తమకు కొంత గడువు కావాలని సింగరేణి కోరిన నేపథ్యంలో.. గురువారం వరకు విశాఖ స్టీల్ గడువు ఇచ్చింది. కానీ గురువారం గడువు ముగిసేనాటికి కూడా సింగరేణి సంస్థ నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేకపోవడంతో ఇక బిడ్ దాఖలు చేయదని విశాఖ కర్మాగారం అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
వాస్తవానికి సింగరేణి పరిస్థితి ఏమంత బాగోలేదు. ఉద్యోగులకు జీతాలే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఇస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణికి వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు సింగరేణి సంబంధించిన డిపాజిట్లను ప్రభుత్వం వాడుకుంటున్నది. దీనినే ప్రశ్నించినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి ప్రకటన పంపించింది. తమ వద్ద 11 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని వివరించింది. 11 వేల కోట్ల డిపాజిట్లు ఉన్న సంస్థ 5,000 కోట్లతో వైజాగ్ స్టీల్ పై ఎందుకు బిడ్ దాఖలు చేయలేదనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న..
అయితే కెసిఆర్ తన రాజకీయం కోసం ఏదైనా చేయగల సమర్ధుడు.. వైజాగ్ స్టీల్ విషయంలో బిడ్ దాఖలు చేస్తామని సింగరేణి ద్వారా ప్రకటించినప్పుడే అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. ఇది ఊదు కాలని పీరి లేవని ముచ్చట అని తెలిసిపోయింది.. అది గురువారం నాటితో మరింత అర్థమైంది.. విశాఖ ఉక్కు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మరింత బద్నాం చేయాలని కెసిఆర్ అండ్ కో తల పోసింది. ఇందులో భాగంగానే మోదీ ప్రైవేటైజేషన్ వైపు వెళ్తుంటే.. తాను నేషనల్లైజేషన్ వైపు వెళ్తున్న అనే సంకేతాలు కెసిఆర్ ఇవ్వాలి అనుకున్నాడు.. ఈ లోగానే కేంద్ర ఎన్నికల సంఘం భారత రాష్ట్ర సమితికి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు లేదని స్పష్టం చేయడంతో సీన్ అర్థమైంది. దీన్ని మరింత తెగేదాకా లాగితే ప్రమాదం గుర్తించి వైజాగ్ స్టీల్ విషయంలో వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కెసిఆర్ కు వైజాగ్ స్టీల్ మీద అంత ప్రేమ ఉంటే బయ్యారం గనులు ఇవ్వచ్చు..కానీ అవేవీ చేయకుండానే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో బిడ్ దాఖలు చేయడం అనేది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు.. మరి దీనిపై టిఆర్ఎస్ నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kcr government did not bid on visakha steel plant
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com