
Puri Jagannadh- Vishwak Sen: లైగర్ డిజాస్టర్ ఫ్లాప్ తో డీలాపడిన పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడా అని ఆయన అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.చాలా మంది ఆయన చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడని, ఈమధ్యనే ఆయనకీ స్క్రిప్ట్ వినిపించి ఓకే చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి.చిరంజీవి తో కచ్చితంగా భవిష్యత్తులో సినిమాలో ఉండొచ్చేమో కానీ, ఈలోపు ఆయన మరో యంగ్ హీరో తో చేయబోతున్నట్టు సమాచారం.
విభిన్నమైన కథలతో ఆడియన్స్ కి తనదైన స్టైల్ లో కిక్ ని ఇస్తూ వరుసగా హిట్స్ ని అందుకుంటున్న విశ్వక్ సేన్ తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న విశ్వక్ సేన్, ఫామ్ లో లేని పూరి జగన్నాథ్ తో సినిమా చేసి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకోబోతున్నాడా అని ఆయన అభిమానులు భయపడుతున్నారు.
పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే ఒక లాభం ఉంటుంది, నష్టం కూడా అంతకు మించే ఉంటుంది.ఆయన ఒక హీరో కి హిట్ ఇస్తే అతని ఇమేజి మారిపోతుంది.పోకిరి కి ముందు వరకు సూపర్ స్టార్ మహేష్ బాబుది క్లాస్ ఇమేజి లాగ ఉండేది.

ఎప్పుడైతే పోకిరి సినిమా చేసాడో ఆయన ఇమేజి మాస్ అయిపోయింది.ఇక అప్పటి వరకు లవ్ స్టోరీస్ తో యూత్ ని అలరించిన పవన్ కళ్యాణ్ ఇమేజి ని ‘బద్రి’ సినిమాతో మార్చింది కూడా ఈయనే.వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ , ప్రభాస్ మరియు రామ్ వంటి హీరోల ఇమేజి ని కూడా మార్చింది పూరి జగన్నాథ్ మాత్రమే.ఇప్పుడు విశ్వక్ సేన్ ని కూడా అలాగే మారుస్తాడా, లేదా విజయ్ దేవరకొండ తో తీసినట్టుగా లైగర్ లాంటి కళాఖండం తీస్తాడా అనేది చూడాలి.