Homeజాతీయ వార్తలుKCR: థర్డ్ వేవ్ పై కేసీఆర్ ఫోకస్.. ప్రజల కోసం స్పెషల్ డ్రైవ్..

KCR: థర్డ్ వేవ్ పై కేసీఆర్ ఫోకస్.. ప్రజల కోసం స్పెషల్ డ్రైవ్..

Corona Vaccination Special DriveKCR: కరోనా (Corona) సృష్టించిన అల్లకల్లోలం అందరికి తెలిసిందే. మొదటి, రెండో దశల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైరస్ మనుషుల ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ విధించాయి. దీంతో కరోనా కట్టడి చేసినా ప్రస్తుతం మూడో దశ ముప్పు ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కరోనా టీకాలు వేయించుకోవడమే ప్రధాన విధిగా సూచిస్తున్నాయి. అందరు టీకాలు వేసుకుని కరోనాను కట్టడి చేయాలని చెబుతున్నాయి. టీకా రెండు డోసులు వేసుకునన్న వారు బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉంది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో అందరు విధిగా టీకా డోసులు వేసుకోవాలని చెబుతోంది. భవిష్యత్ లో కూడా కరోనా రక్కసి వ్యాపించకుండా నిరోధక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. విద్యాసంస్థలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులకు కూడా టీకాలు వేయించేందుకు కసరత్తు చేస్తోంది.

కరోనా వైరస్ వేసవిలోనే జడలు విప్పుతోంది. మొదటి, రెండో దశల్లో కూడా వేసవిలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మూడో దశ ముప్పు ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పిల్లలను రక్షించే క్రమంలో కరోనా టీకాలు వేయించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. మూడో దశ ముప్పు పిల్లలకే అని తెలుస్తున్న క్రమంలో వారిని కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనాతో కనీసం ఐదారేళ్లు సహవాసం చేయాల్సి వస్తుందని తెలుస్తోంది.

కరోనా బారి నుంచి రక్షించుకునే క్రమంలో నిబంధనలు పాటించాల్సిందే. మాస్కులు విధిగా ధరించాలి. శానిటైజర్ రాసుకోవాలి. టీకాలు వేయించుకోవాలి. రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా దాని ఫలితాలు భయంకరంగా ఉంటాయని సూచనలు చేస్తున్నారు.

మరోపక్క డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పలు ప్రాంతాల్లో డెల్టా కేసులు వెలుగు చూడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ నడుచుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular