
గణేశ్ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలి. హుస్సేన్ సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై ఆంక్షలు తొలగించాలి. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలి. కృత్రిమ రంగుల్లేని విగ్రహాలనే అనుమతించాలి. విగ్రహాలను ట్యాంక్ బండ్ కు అనుమతించకుంటే నిమజ్జనానికి సమయం పడుతుంది. వేలసంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి అని జీహెచ్ఎంసీ తెలిపింది.