Bigg Boss OTT Telugu Bindu Madhavi: గతంలో ఎన్నడూ లేనంతగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ నానా హంగామా చేస్తోంది. గతంలో ఎన్నడూ చూడని టాస్క్‌లతో ఈ సారి హోరెత్తిస్తోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో వారం కూడా రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. దాంతో వారంతా సేఫ్ కావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే సమయం చూసి కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. డిఫరెంట్ టాస్క్ లతో ఎక్కడలేని హైప్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓటింగ్ లో టాప్ లో ఉన్న బిందు మాధవి, రెండో ప్లేస్ లో ఉన్న యాంకర్ శివ మధ్య జరిగిన సంగటన ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
నిన్న సరికొత్త టాస్క్‌ను పెట్టాడు బిగ్ బాస్. హైస్ మెంబర్స్‌ను మెప్పించి ఫాలోవర్స్ ట్యాగ్స్ ను సంపాదించే లాగా ఎవరిని తోచిన టాస్క్ లతో వారు అలరించాలంటూ చెప్పుకొచ్చాడు. దీంతో యాంకర్ శివ, బిందు మాధవి, తేజస్వి కలిసి బతుకు జట్కా బండి స్ఫూఫ్ ను చేశారు. ఇందులో యాంకర్ శివ చీరకట్టుకుని వచ్చాడు. తేజస్వి హోస్ట్ గా చేయగా.. బిందు మాధవి వేధించే భర్తగా నటించింది. అయితే యాంకర్ శివ చీర కట్టుకుని వస్తూనే నానా రచ్చ చేశాడు.

అఖిల్ మీద పడి రొమాన్స్ చేశాడు. ఆ తర్వాత కొంతమంది అమ్మాయిలు కూడా అతన్ని కిస్ చేశారనుకోండి.. అది వేరే మ్యాటర్. కాగా స్కిట్ లో భాగంగా శివ బూతు పురాణం ఎత్తుకున్నాడు. తన భర్తకు అసలైంది లేదంటూ పచ్చిగా మాట్లాడాడు. నా భర్తకు గడియారం ఉంది కానీ ముల్లు లేదంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో నానా బీభత్సం చేశాడు. అంటే ఇవన్నీ బిందు మాధవిని ఉద్ధేశించి చెప్పాడన్నమాట. ఇక శివ మాటలకు బిందుమాధవి తెగ సిగ్గుపడుతూ.. అవేం మాటలు బాబూ అంటూ బదులిచ్చింది. అయితే శివ తన బూతులతోనే స్కిట్‌ను పండించడంతో.. ప్రేక్షకులుగా ఉన్న కంటెస్టెంట్లు మొత్తం అతని ఆటకు ఫిదా అయిపోయారు.
Also Read: RRR Movie First Day Worldwide Collection: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Recommended Video:
