CM KCR
CM KCR: కిందవడ్డా.. మీదవడ్డా.. నాదే పైచేయి అంటారు మొండోళ్లు.. అలాంటి మొండి ఘటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పది రోజుల క్రితం.. తెలంగాణ భారీ వర్షాలు వరదలతో తల్లడిల్లుతుంటే.. ప్రగతి భవన్‌లనే కూసుండి అధికారులకు, మంత్రులకు ఆదేశాలిస్తున్నట్లు మీడియాలు ప్రెస్‌నోట్‌లు రిలీజ్ చేసిండు. ఒక్క అడుగు బయటకు కూడా పెట్టలేదు. కనీసం విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో కూడా తిరగలేదు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు వరద తాకిడికి అతలాకుతలమయ్యాయి. అయినా.. సారు ప్రగతి భవన్ నుంచి ఒక్కసారి కూడా ప్రజలకు ధైర్యం చెప్పలేదు.. ఇక వరదల్లో కొట్టుకుపోయి 40 మంది జీవిడిసిండ్రు. మోరంచపల్లి వరదలో మునిగింది.. వరంగల్ నగరంలో రోడ్లు ఏరులై పారినయ్.. ఇండ్లు మునిగి జనాలు అల్లాడిండ్రు.. అయినా.. కష్టాల్లో తండ్రిలెక్క తోడుండాల్సిన.. ధైర్యం చెప్పాల్సిన.. భరోసా ఇవ్వాల్సిన సారు గడప దాటలేదు.
చేరికలు.. మంతనాలు..
ఇక ప్రగతిభవన్‌లో వరదలపై కేసీఆర్ సమీక్ష చేసిండో లేదో తెల్వది కానీ.. కాంగ్రెస్ లీడర్లను పార్టీల చేర్చుకునుడు. మహారాష్ట్ర పగ్గాలు తన్న అన్న కొడుక్కు కట్టబెట్టుడు.. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎట్ల చేయాలని మంత్రులతో ముచ్చట్లు పెట్టుడు మాత్రం జోరుగ చేసిండు. మీడియాలో వరదలపై వార్తలు వస్తుంటే.. తన సొంత మీడియా చానెల్‌లో మిగతా మీడియా వరదలపై తప్పుడు ప్రచారం చేయిస్తుందని వార్తలు రాయించుకున్నడు.. ప్రజలకు కష్టాలే లేనట్లు తన చానెల్‌లో వీడియోలు చూపిండు.
అంతా అయినంక క్యాబినెట్..
వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత సారుపై విమర్శలు రావడంతో హడాడుడి మొదలు పెట్టిండు. వరద బాధితులకు ఏదో చేయాలని తపిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చిండు. అత్యవసరంగా కేబినెట్ బేటి అని ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ కూడా పెడుతం అని పేర్కొన్నడు. అయితే జూలై 31న జరిగి క్యాబినెట్ సమావేశంలో మాత్రం వరద బాధితులకు ఏమిస్తాడో చెప్పలేదు.
తీరిక లేనట్లు…
తెలంగాణ జిల్లాల్లో పర్యటించేంత తీరిక లేనట్లు కేసీఆర్ ప్రగతి భవన్‌లో చాలా బిజీగా ఉన్నట్లు మీడియా ద్వారా ప్రచారం మాత్రం మస్తు చేయించుకున్నడు. ఇక వానలు ఎలిసినంక అయినా.. ప్రజల దగ్గరకు వస్తడని బాధితులు ఎదురు చూసిండ్రు. కానీ సారు తెలంగాణ ప్రజలు కొట్టుకపోతె నాకేంది.. పంటలు మునిగిపోతె నాకేంది అన్నట్లు.. గాలి మోటార్ ఏసుకుని ఆగస్టు 1వ తారీఖు మహారాష్ట్ర పోయిండి. మరి అక్కడ తెలంగాణ ప్రజల కష్టాలకంటే పెద్ద కష్టాలు ఏమైనా ఉన్నయా అంటే.. గవేమీ లేవు.. సార్ ఎందుకు పోయిండంటే.. దళిత సాహితీవేత్త అన్నబావుసాఠే జయంతి వేడుకల్లో పాల్గొనీకి పోయిండు. అక్కడి జనానికి మస్తు ముచ్చట్లు చెప్పిండు. అన్నభావుసాఠేకు భారత రత్న ఇయ్యమని తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానం చేపి పంపుతమని హామీ ఇచ్చిండు. కానీ, తెలంగాణలో వరద బాధితులకు మాత్రం నేను ఉన్నా.. బాధపడకుండ్రి అని ఒక్క ముచ్చట కూడా ఇప్పటికీ చెప్పలేదు. గిట్లుంటది మరి సార్‌తోని…
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr does not care about the flood victims
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com