AI Heroine: Artificial Intelligence (AI)ఈ పేరు ఇప్పుడు పాపులర్ అవుతోంది. కృత్రిమ మేథస్సు కలిగిన ఇది మనుషుల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. అందుకేదీనిని కార్యాలయాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇటీవల న్యూస్ యాంకర్ గా తయారు చేసి ఆకట్టుకున్నారు. భవిష్యత్ అంతా ఏఐ అని అంటున్నారు. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీలోకి ఏఐని ప్రవేశపెడుతున్నారు. అదీ ఓ హీరోయిన్ గా.. అంటే అందమైన హీరోయిన్ గా తయారై ఆమె చేయాల్సిన పనులన్నీ చేస్తుందన్నమాట. మొదటిసారి ఏఐని ప్రవేశపెట్టడానికి ముందుకు వస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మరి ఈ ఏఐ హీరోయిన్ ఎవరి పక్కన నటిస్తుందో తెలుసా?
సౌత్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘జీన్స్’ గుర్తుందా? ఇందులో ఐశ్వర్య పక్కన మరో ఐశ్వర్యను తయారు చేసి చూపిస్తారు. ఆ కాలంలోనే శంకర్ ఏఐ హారోయిన్ ను తయారు చేశారు. అయితే అప్పటి నుంచి పలు సినిమాల్లో ఇలాంటి గ్రాఫిక్స్ లు వాడుతున్నారు. కానీ లేటేస్టుగా ఏఐ పేరు బాగా వినిపిస్తోంది. ‘ఓపెన్ ఏఐ’ అనే సంస్థ కృత్రిమ మేథస్సును ప్రవేశపెట్టి సక్సెస్ చేసింది. ఆ తరువాత ఇటీవలే ఆండ్రాయిడ్ లలో ప్రవేశపెట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
ఈ తరుణంలో సినిమాల్లో కూడా ఏఐని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బన్నీ పక్కన ఏఐ భామను పెట్టాలని చూస్తున్నారు. అయితే ఏఐ హీరోయిన్ సినిమా మొత్తం ఉంటుందా? లేక ప్రత్యేక సాంగ్ లో కనిపిస్తుందా? అనేది తెలియాలి. ఒక వేళ అనుకున్నట్లే ఈ సినిమాలో ఏఐ భామను ప్రవేశపెడితే పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా మరో రికార్డు సృష్టించినట్లే అవుతుంది.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 తో బిజీగా మారాడు. అటు త్రివిక్రమ్ మహేష్ ‘గుంటూరు కారం’ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇవి పూర్తి కాగానే బన్ని సినిమాలో పాల్గొంటారు. అయితే అప్పటి వరకు ఏఐ హీరోయిన్ ను ముందుగానే తయారు చేసి నేరుగా సినిమాల్లో నటింపజేస్తారా? లేక సినిమా పూర్తయిన తరువాత గ్రాఫిక్స్ లో సెట్ చేస్తారా? అనేది తెలియాలి. ఏదీ ఏమైనా తెలుగు వాళ్లు ఇలాంటి రికార్డులు కొట్టడంలో ఈమధ్య ముందుంటున్నారు.