KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కూటమి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇకపై ఢిల్లీ నుంచే ఆయన వ్యవహారాలు సాగుతాయని టీఆర్ఎస్ వర్గాలు డబ్బా కొట్టుకుంటున్నా అది వట్టిదేనని తేలిపోతోంది. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లుగా కేసీఆర్ వి అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలే అని తెలిసిపోతోంది. దీంతో థర్డ్ ఫ్రంట్ విషయం గాడిలో పడుతుందన్న అంచనాలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అంతా డొల్లేనని తెలుస్తోంది.
ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఇద్దరి మధ్య ప్రముఖంగా చర్చ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదర్కోవడం అంత సులభం కాదని పీకే పలుమార్లు చెబుతున్న సందర్భంలో కేసీఆర్ సైలెంట్ అయిపోవడానికి ఇదే కారణమా? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి.
Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి
దీంతో కేసీఆర్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్నా అదంత ఈజీగా ఉండదనే విషయం తెలుసుకుని కిమ్మనకుండా ఉంటున్నట్లు చెబుతున్నారు భవిష్యత్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు కొనసాగవనే విషయం బోధపడటంతోనే నిశ్శబ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో దేశ రాజకీయాలను శాసించాలని భావించినా అది వీలు కాదని తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
వారణాసిలో ప్రచారం చేయాలని భావించినా ఆయనకు ఆహ్వానం అందలేదు. ఉత్తరాదిలో కేసీఆర్ మాటలు వినే అసవరం ఎవరికి ఉండదు. దీంతోనే ఆయనకు పిలుపు రాలేదని తెలుస్తోంది. కేసీఆర్ ఏదో అద్భుత శక్తులున్న వ్యక్తి కాదని పెద్దగా ఊహించుకోవడంతోనే ఏదో చేస్తారని అనుకోవడం కేసీఆర్ భ్రమగానే చెబుతున్నారు.
కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకోవాలని సూచిస్తున్నారు. మొదట తెలంగాణలో పరిస్థితి చక్కదిద్దుకుని తరువాత ఢిల్లీ వైపు చూడాలని అందరు సూచనలు చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళితే చాలు ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేసుకోవడం టీఆర్ఎస్ కు పరిపాటిగా మారుతోంది.
Also Read: మోడీనా మజాకా.. రష్యాను నిలువరించి.. యుద్ధాన్ని 6 గంటలు ఆపిన ప్రధాని