Homeఎంటర్టైన్మెంట్Ketika Sharma: స్టార్ హీరోల వైపు చూస్తున్న క్రేజీ బ్యూటీ !

Ketika Sharma: స్టార్ హీరోల వైపు చూస్తున్న క్రేజీ బ్యూటీ !

Ketika Sharma:  రొమాంటిక్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అనంతరం వచ్చిన లక్ష్య మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ మీదే ఆశలు పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గిరీషాయ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 27న రిలీజ్ కానుంది. 3వ మూవీతోనైనా ఈ బ్యూటీకి హిట్ పడుతుందా లేదో చూడాలి.

Ketika Sharma
Ketika Sharma

ఒకవేళ హిట్ అయితే.. ఈ బ్యూటీకి ఇక తిరుగులేదు. పైగా టాలీవుడ్ కి కథల్లో కొత్తదనం లేకపోయినా నటీమణుల విషయంలో మాత్రం నిత్యం కొత్తదనం కావాలి. అందుకే, ప్రతి సంవత్సరం తెలుగు తెర పై కనీసం డజను మంది కొత్త భామలు గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. వాళ్ళల్లో అందాల ఆరబోతకు సై అనేవాళ్ళు స్టార్ డమ్ సాధించి కొన్నాళ్ళు ఓ ఊపు ఊపేస్తారు. కాకపోతే అందాలు ఎంత ఆరబోసినా వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేరు అనుకోండి.

Also Read:  ప్రపంచంలో మొదటి సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా తీశారు ?

కానీ, కొంతమంది మాత్రం మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకుంటారు. ఆ కోవలోకే వస్తోంది కేతిక శర్మ. టాలీవుడ్‌ లోకి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్స్ లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా తెలుగులో నటించేందుకు ఈ భామ 20 లక్షలు కంటే ఎక్కువ అడగట్లేదు.

Ketika Sharma
Ketika Sharma

అందుకే.. అమ్మడు ఎక్కువ డిమాండ్ చేయట్లేదు కాబట్టి.. మేకర్స్ ఛాన్స్ లు ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, మేకర్స్ ఆసక్తి చూపించినా.. అమ్మడు తన డేట్లు మాత్రం అన్ని సినిమాలకి ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో ఏ కొత్త హీరోయిన్ లో ఏ కోణంలోనైనా మ్యాటర్ ఉంది అని అనిపిస్తే చాలు.. అందరి చూపు ఆమె వైపుకి వెళ్లిపోతుంది. కేతిక స్టార్ హీరోల సినిమాల వైపు చూస్తోంది.

Also Read:  అల్లు అర్జున్ వదిలేసిన 12 సినిమాలివే.. వీటిలో 6 బ్లాక్‌ బస్టర్స్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] OKtelugu MovieTime:  మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ విశేషాలను హీరో శర్వానంద్ మీడియాతో పంచుకున్నాడు. ‘ఆడవాళ్లందరి మధ్య కూర్చుని చాలా సరదాగా చేసిన సినిమా ఇది. కామెడీ కోసమని ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథలో భాగంగానే ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశా. రాధిక, ఖుష్బూతో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చింది. రష్మిక చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. […]

Comments are closed.

Exit mobile version