https://oktelugu.com/

Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, ఈ సినిమా విడుదలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చాడు. ‘ఒకటి, రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని రానా చెప్పుకొచ్చాడు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 3, 2022 / 12:33 PM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, ఈ సినిమా విడుదలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చాడు. ‘ఒకటి, రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని రానా చెప్పుకొచ్చాడు.

    virata parvam

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. హీరోయిన్ హన్సిక కొత్త సినిమాలో నటించనుంది. R కన్నన్ దర్శకత్వంలో వస్తున్న తమిళ మూవీ పూజా ఫంక్షన్ చెన్నైలో జరిగింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో హన్సిక యువ శాస్త్రవేత్తగా నటిస్తుందని చిత్రబృందం తెలిపింది. ఇందుకోసం భారీ ఖర్చుతో సైన్స్ ల్యాబ్ సెట్ వేశామని పేర్కొంది. త్వరలో నటీనటుల వివరాలను ప్రకటిస్తామని చెప్పింది.

    Also Read:   టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

     

    Hansika Motwani

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొన్నియన్‌ సెల్వన్‌-1 విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇటీవల విడుదలైన ఐశ్వర్యరాయ్‌, త్రిష, విక్రమ్‌, జయం రవి, కార్తి ఫస్ట్‌ లుక్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

    mani ratnam

    కాగా కల్కి రచించిన పొన్నియన్‌ సెల్వన్‌ పుస్తకం ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి తర్వాత భారీ తారాగణంతో, చరిత్ర నేపథ్యంలో వస్తున్న చిత్రం ఇదే.

    Also Read: బిగ్ బాస్ OTTకి బ్రేక్.. నిలిచిన లైవ్ స్ట్రీమింగ్

    Tags