Kerala Wife and Husband: సామాజిక మాధ్యమాల ప్రభావం సమాజం మీద పెనుప్రభావమే చూపుతున్నాయి. ఫలితంగా సంసారారాలే చిద్రం అవుతున్నాయి. యాభై ఏళ్లు దాటినా పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేరళలో చోటుచరేసుకున్న ఓ సంఘటన దాంపత్య జీవితంలో విషాదమే నింపింది. కట్టుకున్న భార్యను కడతేర్చే వరకు వెళ్లింది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంత ప్రభావం చూపుతుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. భార్య చేసిన పనికి భర్త చివరకు చంపడం వరకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.

అసోం కు చెందిన ఫక్రుద్దీన్ (52, రజియా బేగం (50) భార్యా భర్తలు బతుకు దెరువు కోసం కేరళలోని పెరంబపూర్ కు వచ్చారు. అక్కడ ఓ ఫ్లైవుట్ కంపెనీలో భార్యాభర్తలు పనికి కుదిరారు. కొన్నాళ్లు ఇద్దరు కలిసి పనిచేసినా తరువాత భార్య పని మానేసింది. ఇంటిదగ్గర ఉంటోంది. దీంతో భర్త ప్రతిరోజు పనికి వెళ్తూ సాయంత్రం వచ్చేవాడు. ఈ క్రమంలో ఇంటిపట్టున ఉంటున్న భార్య సామాజిక మాధ్యమాల్లో విరివిగా పోస్టులు పెడుతూ ఉండేది. ఈక్రమంలో ఓ ఇద్దరు యువకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Also Read: ఏసీ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే?
కొన్నాళ్ల పాటు గుట్టుగా సాగినా తరువాత కాలంలో భర్తకు తెలిసింది. దీంతో పద్దతి మార్చుకోవాలని హితవు పలికాడు. కానీ ఆమె ప్రవర్తన మారలేదు. దీంతో ఓ సారి హెచ్చరించాడు. చంపేసి శవం కూడా దొరకకుండా చేస్తానని చెప్పడంతో కూడా ఆమె మారలేదు. ఈ నేపథ్యంలో ఓరోజు అనుకున్నంత పపి చేశాడు. భార్యను కొడవలితో నరికి చంపి శవాన్ని మాయం చేసి అసోం పారిపో యాడు. అక్కడ జురియా ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు.
అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. తన భార్య ఇద్దరు యువకులతో సంబంధం పెట్టుకుందని వాపోయాడు. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. అందుకే చివరకు చంపానని ఒప్పుకున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల ప్రభావం ఓ కుటుంబాన్నే వేరు చేసింది. కట్టుకున్న భార్యను కడతేర్చేలా చేసింది. స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతకు దారి తీసిందో అర్థమవుతోందా? అందుకే తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియా మోజులో పడి జీవితాలను గుళ్ల చేసుకోవద్దని చెబుతున్నారు.
Also Read: పెళ్లిలో వధూవరులు ఏడడగులు ఎందుకు వేస్తారు..? వాటి అర్థం ఏంటి..?