https://oktelugu.com/

సంచలనం: తప్పు జరిగింది.. సారీ చెప్పిన ఏపీ హోంమంత్రి

ఆమె ఏపీకి హోంమంత్రి.. అయినా కూడా తాము చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకుంది. చేసిన తప్పుకు క్షమించమని ప్రజలను వేడుకుంది. ఇలాంటి ధైర్యం, తెగువ సమకాలనీ రాజకీయాల్లో ఎవరికి ఉండదు. హోంమంత్రి ధైర్యానికి ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. Also Read: మరో వివాదంలో ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి? సీఎంలు కేసీఆర్, జగన్ సహా ఇప్పటిదాకా పాలించిన ఏంతో మంది నేతలు, ప్రధానులు సైతం తమ నిర్ణయాలపై ఎప్పుడూ పశ్చాత్తాపాలు, సారీలు చెప్పలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 12:30 PM IST
    Follow us on

    ఆమె ఏపీకి హోంమంత్రి.. అయినా కూడా తాము చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకుంది. చేసిన తప్పుకు క్షమించమని ప్రజలను వేడుకుంది. ఇలాంటి ధైర్యం, తెగువ సమకాలనీ రాజకీయాల్లో ఎవరికి ఉండదు. హోంమంత్రి ధైర్యానికి ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

    Also Read: మరో వివాదంలో ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి?

    సీఎంలు కేసీఆర్, జగన్ సహా ఇప్పటిదాకా పాలించిన ఏంతో మంది నేతలు, ప్రధానులు సైతం తమ నిర్ణయాలపై ఎప్పుడూ పశ్చాత్తాపాలు, సారీలు చెప్పలేదు. కానీ ప్రజలకు జరిగిన నష్టానికి సారీ చెప్పి ఏపీ హోంమంత్రి సుచిరత సారీ చెప్పడం విశేషం.

    ‘తప్పు జరిగింది.. నన్ను క్షమించండి’ అంటూ ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సమాధులు కూల్చిన శ్మశాన వాటినకను హోంమంత్రి సుచరిత సందర్శించారు. శ్మశాన వాటికలో సమాధుల కూల్చివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా హోంమంత్రి తెలిపారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్ల పొరపాటున సమాధుల కూల్చివేత సంఘట జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.

    ఈ సంఘటనకు కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పడగొట్టిన అన్ని సమాధులను తిరిగి నిర్మించి ఇవ్వడమే కాకుండా శ్మశానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

    Also Read: రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా?

    సమాధులను పొరపాటున కూల్చడం కారణంగా సంబంధిత కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయన్న సుచరిత.. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. పొరపాటుకు పెద్ద మనసు చేసుకొని క్షమించమని కోరుతున్నట్లు తెలిపారు.