కేసీఆర్ దళిత బంధు..దరిచేరేనా ఎన్నికల ముందు

హుజురాబాద్ ఉప ఎన్నిక మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోంది. పథకాల పంట పండించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దళిత బంధు పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టి దళితుల జీవన స్థితిగతులను మారుస్తామని చెబుతోంది. దీంతో రాష్ర్టంలో దళిత బంధు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకంపై పెదవి విరుస్తున్నారు. ఇది కూడా అమలు […]

Written By: Srinivas, Updated On : July 25, 2021 7:30 pm
Follow us on

హుజురాబాద్ ఉప ఎన్నిక మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోంది. పథకాల పంట పండించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దళిత బంధు పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టి దళితుల జీవన స్థితిగతులను మారుస్తామని చెబుతోంది. దీంతో రాష్ర్టంలో దళిత బంధు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకంపై పెదవి విరుస్తున్నారు. ఇది కూడా అమలు దాల్చడం కష్టమే అని చెబుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధు ప్రధాన ఎన్నికల అస్ర్తంగా మారనుంది. దళిత బంధు పథకానికి రూ.80 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి దళిత వాడలో ఒక కేసీఆర్ పుట్టాలన్న ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దళితబంధు పథకంతో దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలని ఆకాంక్షిస్తున్నారు. సామాజిక వివక్ష రూపుమాపేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతున్నారు.

దళితులు తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నారు.వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే ధ్యేయంగా దళిత బంధు పథకం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. వందేళ్ల పీడనను అణచడానికి ఈ పథకం తోడ్పడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నామని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

రాష్ర్టంలో సాగునీటి ప్రాజక్టులు చేపట్టినప్పుడు కూడా ఇదే విధంగా సందేహాలు వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఇస్తామంటే అది సాధ్యం కాదని ప్రతిపక్షాలు గొంతెత్తాయి. అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పాం. వ్యవసాయం దండగ అన్న వారే ఇప్పుడు పండుగ అంటున్నారు. తెలంగాణను అగ్రభాగాన నిలిపే క్రమంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు. నిరంతరం కొనసాగే పనులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇన్నాళ్లు దళితులకు బ్యాంకులు గ్యారంటీ ఇవ్వకపోవడంతో రుణాలు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా పలు పథకాలు తీసుకొచ్చేలా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.