సంచలనం: మహేష్-రాజమౌళి సినిమా కథ బయటపెట్టిన విజయేంద్రప్రసాద్

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ తనానికి పెట్టింది పేరు.. బాహుబలి ఇప్పటికే బంపర్ హిట్ కాగా.., ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఏ లెవల్ లో వస్తుందో చూస్తుంటే దేశమంతా ఆశ్చర్యపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి చిత్రం గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. రాజమౌళి నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్నాడు. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాటైంలోనే అనౌన్స్ చేశాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా ఎలా ఉంటుందనే […]

Written By: NARESH, Updated On : July 26, 2021 10:59 am
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ తనానికి పెట్టింది పేరు.. బాహుబలి ఇప్పటికే బంపర్ హిట్ కాగా.., ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఏ లెవల్ లో వస్తుందో చూస్తుంటే దేశమంతా ఆశ్చర్యపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి చిత్రం గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

రాజమౌళి నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్నాడు. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాటైంలోనే అనౌన్స్ చేశాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతూ రాజమౌళి తండ్రి.. వీరిద్దరి సినిమాకు కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ సంచలన విషయాలను పంచుకున్నారు. రాజమౌళి-మహేష్ బాబు సినిమా కథపై ఓ హింట్ ఇచ్చాడు. ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇవిప్పుడు సంచలనమయ్యాయి.

‘మహేష్ బాబుతో సినిమా కోసం కథ రెడీ చేయాలని ఒకసారి రాజమౌళి నా దగ్గరకు వచ్చి కథ కావాలని అడిగాడని.. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండాలని చెప్పాడని’ విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక అదింకా స్క్రిప్ట్ దగ్గరే ఉందని.. కరోనా టైంలో ఏ పని సాధ్యం కావడం లేదని తెలిపారు.

తనకు, రాజమౌళికి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం అని.. ఆయన పుస్తకాల ఆధారంగా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా అని విజయేంద్ర ప్రసాద్ సంచలన విషయాలు పంచుకున్నారు.

ఇక మహేష్ బాబు-రాజమౌళి తీయబోయే సినిమా ‘ఆర్ఆర్ఆర్’; బాహుబలి సినిమాలను మించి భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు తెలిపారు. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది.