కేసీఆర్ ట్రెండ్ సృష్టిస్తాడు.. ఫాలో అవ్వడు.!

నలుగురు నడిచిన దారిలో నడిస్తే తమ ప్రత్యేకత ఏముంటుంది.? అందుకే సీఎం కేసీఆర్ కొత్త దారిలో ఎప్పుడూ నడుస్తాడు. తన సృష్టించిన ట్రెండ్ నే అందరూ ఫాలో కావాలని.. వాళ్ల ట్రెండ్ ను తాను ఫాలో అవ్వను అని ఆయన సిద్ధాంతం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. దీన్ని బట్టి కేసీఆర్ రూటే సెపరేట్ అని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్! *లాక్ డౌన్ లో కేసీఆర్ తీరే వేరు కరోనా […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 2:06 pm
Follow us on


నలుగురు నడిచిన దారిలో నడిస్తే తమ ప్రత్యేకత ఏముంటుంది.? అందుకే సీఎం కేసీఆర్ కొత్త దారిలో ఎప్పుడూ నడుస్తాడు. తన సృష్టించిన ట్రెండ్ నే అందరూ ఫాలో కావాలని.. వాళ్ల ట్రెండ్ ను తాను ఫాలో అవ్వను అని ఆయన సిద్ధాంతం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. దీన్ని బట్టి కేసీఆర్ రూటే సెపరేట్ అని అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

*లాక్ డౌన్ లో కేసీఆర్ తీరే వేరు
కరోనా వైరస్ ను కట్టడికి లాక్ డౌన్ విధింపులో.. విరమణలో కేసీఆర్ తీరే వేరు అని ఆది నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ విధించిన డేట్ కు ఇంకా ఎక్కువనే కేసీఆర్ తెలంగాణలో పొడిగిస్తారు. నెలరోజులయ్యాక దేశంలో పలురంగాలకు మోడీ మినహాయింపులు ఇస్తే కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఆ పప్పులు ఉడకవని.. ఇక్కడ సర్వం బందే అంటారు. ఇక రెండో విడత లాక్ డౌన్ ను మోడీ మే 3వరకు పొడిగించి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చాడు.కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఏకంగా మే 7వరకు లాక్డౌన్ పొడిగించి కేంద్రం మినహాయింపులు, నిబంధనలు, మార్గదర్శకాలు తెలంగాణలో పాటించము అంటూ కుండబద్దలు కొట్టేస్తారు. ఆయా రంగాలకు కనీసం రిలాక్సేషన్ ఇస్తే వారంతా పనిచేసుకొని బతికే అవకాశం ఉన్నా కేసీఆర్ మాత్రం ఇవ్వనే ఇవ్వకుండా ఉంటున్నారు.

*కరోనా కట్టడిలో కేసీఆర్ స్ట్రిక్ట్
కరోనా కట్టడిలో కేసీఆర్ మరీ సిరియస్ గా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. పక్క రాష్ట్ర సీఎం జగన్ సహా అందరూ కేంద్రం నిబంధనల ప్రకారం కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తే కేసీఆర్ మాత్రం తెలంగాణలో తను గీసిందే గీత.. రాసిందే రాత అన్నట్టుగా అవేవీ కుదరదు అనేశారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేవి తెలంగాణలో అమలు కావడం లేదు. ఇదంతా కరోనా కట్టడికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే. అందరూ ప్రశంసించాల్సిందే.. ఫాలో కావాల్సిందే.. కానీ దీనివెనుక ప్రజా ప్రయోజనం ఉన్నా కూడా ఉపాధి కోల్పోయిన రంగాలు కోలుకునేందుకు ఇచ్చిన సడలింపులు ఇస్తే వారు అర్థాకలితో ఉండకుండా ఉంటారు. కేసీఆర్ ఇది ఆలోచిస్తే బెటర్ అని సూచిస్తున్నాయి.

కేటీఆర్ నోట జగన్ మాట!

*తాజాగా మందు బంద్ చేసిన కేసీఆర్
దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా మూడు జోన్లుగా విభజించిన కేంద్రం రెడ్ మినహాయించి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రజలను పనిచేసుకునేలా ఎన్నో మినహాయింపులు ఇచ్చింది. ఇక మద్యం ను కూడా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అనుమతించారు. అయితే కేసీఆర్ తెలంగాణలో మే 7వరకు లాక్డౌన్ పొడిగించారు. దీంతో మద్యం అమ్మకాలపై ఎలాంటి ప్రకటన కేసీఆర్ చేయలేదు.

*చుట్టుపక్కల రాష్ట్రాల్లో మొదలైన మందు.. తెలంగాణకు రాదా?
చుట్టుపక్కల ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. కేంద్రం ఆదేశాలు, నిబంధనలు ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రీన్, రెడ్ జోన్లలో ఈరోజు నుంచి మద్యం అమ్మకాలు షురూ చేశారు. దీంతో తెలంగాణకు ఈ మద్యం అక్రమ మార్గాల్లో రావడం ఖాయం. ఆ కల్తీ మందు.. ఎక్కువ రేటు పెట్టి కొనే బదులు కేసీఆరే తెలంగాణలో మద్యం షాపులు తెరిస్తే తెలంగాణ జనాలకు ఇన్ని బాధలు ఉండవు కదా అని మందుబాబులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

*కేసీఆర్ మాట తప్పడంతే..
పక్కా రాష్ట్రాలు మద్యంకు బార్లా తెరిచినా సరే కేసీఆర్ మాత్రం తెలంగాణలో తెరవనే తెరువనంటూ భీష్మించుకు కూర్చున్నారు. కేంద్రం మద్యం అమ్మకాలు సై అన్నా తెలంగాణలో ఈరోజు వైన్స్ ప్రారంభం కాలేదు. కేసీఆర్ విధించిన మే 7 తర్వాతే మొదలయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎక్కడ ఏది జరిగినా కేసీఆర్ మాట తప్పడన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.

-నరేష్ ఎన్నం