https://oktelugu.com/

తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న కరోనా..!

తెలంగాణ కరోనా మమ్మహరి ప్రభుత్వ యంత్రాగానికి చుక్కలు చూపిస్తోంది. కరోనా మహమ్మరిపై అధికారులు పైచేయి సాధిస్తున్నారనగానే కరోనా రక్కాసి కోరలు చేస్తోంది. గడిచిన వారం క్రితం రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఆదివారం ఒక్కసారిగా 21కేసులకు చేరింది. వారంరోజులుగా కేవలం హైదరాబాద్లోనే కేసులు నమోదవుతుండగా ఆదివారం ఒక కేసు జగిత్యాల జిల్లాలో నమోదయింది. జగిత్యాలలో గడిచిన 14రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో ఈ జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 / 02:22 PM IST
    Follow us on


    తెలంగాణ కరోనా మమ్మహరి ప్రభుత్వ యంత్రాగానికి చుక్కలు చూపిస్తోంది. కరోనా మహమ్మరిపై అధికారులు పైచేయి సాధిస్తున్నారనగానే కరోనా రక్కాసి కోరలు చేస్తోంది. గడిచిన వారం క్రితం రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఆదివారం ఒక్కసారిగా 21కేసులకు చేరింది. వారంరోజులుగా కేవలం హైదరాబాద్లోనే కేసులు నమోదవుతుండగా ఆదివారం ఒక కేసు జగిత్యాల జిల్లాలో నమోదయింది. జగిత్యాలలో గడిచిన 14రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో ఈ జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్లింది. అయితే ఆదివారంనాడు ఈ జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో అందరిలో ఆందోళన మొదలైంది.

    తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

    కేంద్ర ప్రభుత్వం తాజాగా మే 17వరకు లాక్డౌన్ పొడగించింది. ఈనేపథ్యంలోనే రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సడలింపును తెలంగాణలో అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నవేళ గ్రీన్ జోన్లలో కరోనా కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈమేరకు గ్రీన్ జోన్లను ఎన్నిరోజులకు గుర్తించాలనేది సమస్యగా మారింది. అలాగే ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాలకు అనుమతులిస్తే కరోనా కట్టడి సాధ్యమేనా అనే సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

    కేటీఆర్ నోట జగన్ మాట!

    రాష్ట్రంలో కరోనా కట్టడికి, రాష్ట్ర ఖజనా పెంచేందుకు తీసుకోవాల్సిన వ్యూహంపై కేసీఆర్ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్లోనే ఎక్కువగా రెడ్ జోన్లు ఉండటంతో ఇక్కడి సడలింపులిస్తే కరోనా మరింత విజృంభించే అవకాశం లేకపోలేదు. ఒక్క హైదరాబాద్ నుంచే తెలంగాణకు 60శాతం దాకా ఆదాయం సమకూరుతుండగా ఇక్కడ సడలింపులు ఇవ్వకపోతే పెద్దఎత్తున ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సడలింపులు తెలంగాణలో ఏమేరకు అనుమతించాలనే దానిపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతోన్నారు. మరోవైపు తెలంగాణలోని గ్రీన్ జోన్లలో కొత్త కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.