తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!
ఈ విషయంపై తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించింది. ‘ఆచార్య’ మూవీతో తాను నటించే విషయంపై ఫుల్ క్లారిటీ ఇవ్వడంతోపాటు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి పక్కన నటించేందుకు తానేంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో కాజల్ నటించిన సంగతి తెల్సిందే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా నటించి మెప్పించింది. ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. కాగా ‘ఆచార్య’ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మణిశర్మ-చిరంజీవి కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.