Homeజాతీయ వార్తలుKCR: జిల్లాల‌కు కేసీఆర్‌.. అస‌లు వ్యూహం అదేనా..?

KCR: జిల్లాల‌కు కేసీఆర్‌.. అస‌లు వ్యూహం అదేనా..?

KCR: తెలంగాణ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. అప్ప‌టిక‌ప్పుడు కొత్త వ్యూహాల‌ను తెర‌మీద‌కు తెస్తున్నాయి అన్ని రాజ‌కీయ పార్టీలు. ఇక సీఎం కేసీఆర్ త‌న రూటు చేంజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇ్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అంటే ప్రగ‌తిభ‌వ‌న్ లేదంటే ఫామ్ హౌస్ కే ప‌రిమితం అనే విమ‌ర్శ‌లు అటు ప్ర‌జ‌ల నుంచి ఇటు ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపించేవి. కానీ ఇప్పుడు ఈ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

KCR
KCR

ఇందులో భాగంగానే ఇప్ప‌టి నుంచే జిల్లాల ప‌ర్య‌ట‌న స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇలా అనూహ్యంగా జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డంతో కేసీఆర్ మ‌ళ్లీ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో 2018లో కూడా ఇలాగే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ముంద‌స్తుకు వెళ్లి సంచ‌ల‌న విజ‌యం సాధించారు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసేశారు కేసీఆర్‌. ఇప్పుడు మ‌రోసారి ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాష్ట్రంలో టీఆర్ ఎస్ మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌, దాంతో పాటే బీజేపీ భ‌విష్య‌త్‌లో టీఆర్ ఎస్‌కు పోటీ ఇస్తుంద‌నే టెన్ష‌న్ ఉంది. ఇక‌పోతే కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈరెండు పార్టీలు క‌లిసి త‌న‌కు ఎక్క‌డ అధికారాన్ని దూరం చేస్తాయో అనే భ‌యం టీఆర్ ఎస్‌లో ఉంది. రోజురోజుకూ ఈ రెండు పార్టీలు పుంజుకోవ‌డంతో ఇప్పటి నుంచే త‌న మీద వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారంట‌.

Also Read: Dating Survey 2021: టాప్ ప్లేస్ లో మహానగరం.. ఎందులో అనుకుంటున్నారు.. డేటింగ్ లో..

కాగా కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కార్ మీద కూడా రైతుల్లో, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. కాబ‌ట్టి దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకుని బీజేపీకి రాష్ట్రంలో చెక్ పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నారంట‌. ద‌ళిత బంధు స్కీమ్‌ను కొంత‌మేర అమ‌లు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నారంట‌. డిసెంబ‌ర్ 19 నుండే వ‌న‌ప‌ర్తి జిల్లాలో స్టార్ట్ చేసి నాగ‌ర్‌క‌ర్నూలు అలాగే నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, వికారాబాద్లో జిల్లాల్లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాల్లో పాల్గొంటారు కేసీఆర్‌. కాగా ఈ కార్య‌క్ర‌మాలు మొత్తం కేసీఆర్ ప్లాన్ ప్ర‌కార‌మే పెట్టుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read: Inter 1st Year Results: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై ఆందోళన.. ప్రభుత్వంపై నిరసన

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version